Categories: LATEST UPDATES

కంటోన్మెంట్ లో ఎనిమిది జోన్లు

  • భూమి వినియోగం కోసం బోర్డు ప్రతిపాదన

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలోని భూమి వినియోగానికి సంబంధించి బోర్డు అధికారులు ఓ ప్రణాళికను ప్రతిపాదించారు. కంటోన్మెంట్ లో ఖాళీగా ఉన్న భూమిని ఎనిమిది జోన్లుగా విభజించారు. ఈ ప్రతిపాదనల ప్రకారం ఖాళీ స్థలాలను రెసిడెన్షియల్, కమర్షియల్, మిక్స్ డ్ యూజ్ జోన్ (రెసిడెన్షియల్, కమర్షియల్), లిమిటెడ్ మిక్స్ డ్ యూజ్ జోన్ (కేవలం రోడ్డు ఫేస్ మాత్రమే కలిగిన రెసిడెన్షియల్, కమర్షియల్ ఏరియాలు), ఆర్థికంగా బలహీనవర్గాల కోసం జోన్, సంస్థాగత ఏరియా జోన్, గ్రీన్ జోన్, ఆర్మీ లేదా డిఫెన్స్ జోన్, ప్రభుత్వ జోన్ గా విభజించారు.

ఈ ప్రతిపాదనకు బోర్డు సమావేశంలో ఏకగ్రీవ ఆమోదం లభించింది. దీనిని పుణెలోని డిఫెన్స్ ఎస్టేట్స్ ప్రిన్సిపల్ డైరెక్టర్ ఆమోదం కోసం పంపిస్తారు. అక్కడ ఆమోదం లభించిన తర్వాత అధికారికంగా ప్రకటిస్తారు. ఇక కంటోన్మెంట్ లోని ప్రాపర్టీ యజమానుల నుంచి స్టిల్ట్, సెల్లార్, బేస్ మెంట్ ఫ్లోర్ కోసం డెవలప్ మెంట్ చార్జీల కింద చదరపు గజానికి రూ.400 వసూలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

This website uses cookies.