దేశంలో వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పించే పరిశ్రమ రియల్ ఎస్టేట్. పట్టణీకరణ పెరగడం, ప్రభుత్వాలు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తుండటంతో రియల్ పరిశ్రమ క్రమంగా అగ్రపథంలోకి దూసుకెళ్తోంది. ఐఎంఏఆర్ సీ గ్రూప్ నివేదిక ప్రకారం మనదేశ రియల్ ఎస్టేట్ మార్కెట్ 2023-2028 మధ్య కాలంలో 9.2 శాతం వృద్ధి రేటు ప్రదర్శిస్తుందని అంచనా. ఇక ఈ గ్రూప్ ప్రకారం 2023లో దేశంలోని టాప్ రియల్ ఎస్టేట్ కంపెనీలు ఇవే..
బ్రిగేడ్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్.. కర్ణాటకకు చెందిన ఈ కంపెనీని 1986లో స్థాపించారు
డీఎల్ఎఫ్ లిమిటెడ్. హర్యానాలో హెడ్ ఆఫీసు ఉన్న ఈ కంపెనీ 1946లో మొదలైంది<l/i>
ఎక్స్ పీరియన్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్. హర్యానా కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీ 2006లో ప్రారంభమైంది
గోద్రేజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్ (గోద్రేజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్). మహారాష్ట్రకు చెందిన ఈ కంపెనీని 1990లో స్థాపించారు
జేపీ ఇన్ ఫ్రాటెక్ లిమిటెడ్ (జైప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్). యూపీకి చెందిన ఈ కంపెనీ 2007లో మొదలైంది
లోధా గ్రూప్. మహారాష్ట్రకు చెందిన ఈ కంపెనీ 1980లో ప్రారంభమైంది
మెర్లిన్ గ్రూప్. పశ్చిమ బెంగాల్ కు చెందిన ఈ కంపెనీ 1984 నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తోంది
ఒబెరాయ్ రియల్టీ లిమిటెడ్. 1998లో ప్రారంభమైన ఈ కంపెనీ ప్రధాన కార్యాలయం మహారాష్ట్రలో ఉంది
పీఎన్ సీ ఇన్ ఫ్రాటెక్ లిమిటెడ్. యూపీకి చెందిన ఈ కంపెనీ 1999 నుంచి పని చేస్తోంది
ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్. కర్ణాటక ప్రధాన కార్యాలయంగా ఉన్న ఈ కంపెనీ 1986లో మొదలైంది
శోభా లిమిటెడ్. కర్ణాటకకు చెందిన ఈ కంపెనీని 1995లో స్థాపించారు
సన్ టెక్ రియల్టీ లిమిటెడ్. మహారాష్ట్రలో ప్రధాన కార్యాలయం ఉన్న ఈ కంపెనీ 1981లో ప్రారంభమైంది