Categories: PROJECT ANALYSIS

లగ్జరీ అపార్ట్ మెంట్లలో ఔరా

సరసమైన ధరలో అద్భుతంగా నిర్మిస్తున్న లగ్జరీ అపార్ట్ మెంట్లు.. ఇదే ఔరా ప్రత్యేకత. సరసమైన లగ్జరీ అపార్ట్ మెంట్లలో ఇదో విప్లవం. లేఔట్ దగ్గర నుంచి అపార్ట్ మెంట్ డిజైన్, ప్రపంచ స్థాయి సౌకర్యాల వరకు అన్నింటిపైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టి రూపొందించిన ప్రాజెక్టు ఇది. తక్కువకే ఎక్కువ వచ్చే నమ్మశక్యం కాని అంశమిది.

సమర్థవంతమైన వ్యయ పద్ధతులు వినియోగించడంతోపాటు ఆధునిక సాంకేతికతను సరైన రీతిలో ఉపయోగించడం ద్వారా ఔరాను సరసమైన లగ్జరీ ప్రాజక్టుగా తీర్చిదిద్దారు. అంటే తక్కవ ధరకే చాలా ఎక్కువ అందిస్తారన్నమాట. ప్రపంచస్థాయి జీవన ప్రమాణాలు, విలాసాలను చక్కగా ఏర్పాటు చేస్తున్న సరసమైన గేటెడ్ కమ్యూనిటీ ఔరా. రెరాలో నమోదై, హెచ్ఎండీఏ ఆమోదించిన ఈ ప్రాజెక్టులో చాలా సౌకర్యాలున్నాయి. అందంగా డిజైన్ చేసిన ప్రవేశ ద్వారం, డీజీ పవర్ బ్యాకప్ పాయింట్లు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్, మురికినీటీ శుద్ది వ్యవస్థ, వ్యక్తిగత గ్యాస్ పైప్ లైన్ కనెక్షన్లు, అవెన్యూ ప్లాంటేషన్, షటిల్ కోర్టు, ఔట్ డోర్ స్పోర్ట్స్, ఔట్ డోర్ యాంఫిథియేటర్, జాగింగ్ ట్రాక్, పిల్లల ఆటస్థలం వంటి బోలెడు సౌకర్యాలున్నాయి. కామన్ వాల్స్ లేకపోవడం మరో ప్రత్యేకత.

పటాన్ చెరు-శంకర్ పల్లి రోడ్డులో 2.3 ఎకరాల విస్తీర్ణంలో పూర్తి వాస్తు అనుకూలంగా 4 బ్లాకుల్లో 210 యూనిట్లు అందుబాటులోకి రానున్నాయి. 1050 చదరపు అడుగుల విస్తీర్ణంలో 2 బీహెచ్ కే లగ్జరీ అపార్ట్ మెంట్లు అద్భుతంగా రూపుదిద్దుకోనున్నాయి. 1050 చదరపు అడుగుల్లో కామన్ ఏరియా 243 చదరపు అడుగులు కాగా, బిల్టప్ ఏరియా 807 చదరపు అడుగులు. ఇక బాల్క‌నీ 81 చదరపు అడుగులు, కార్పెట్ ఏరియా 645 చదరపు అడుగులు ఉండనుంది
డిజైనర్ లాండ్ స్కేప్ తోపాటు పిల్లల ఆటస్థలం, 8వేల చదరపు అడుగుల్లో క్లబ్ హౌస్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ప్రతి ఒక్కరికీ కావాల్సినవి ఉంటాయి. ఎంట్రన్స్ లాబీ, కాఫీ లాంజ్, మల్టీపర్పస్ హాల్, పూర్తి పరికరాలతో కూడిన జిమ్, స్పా, మూడు గెస్ట్ రూములు ఉన్నాయి. ఔరా ప్రాజెక్టు ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నందున ఆరోగ్యకరమైన, చక్కని జీవితం గడపడానికి ఎంతో అనువైనది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఐటీ కారిడార్ కు సమీపంలో ఉండటం ఈ లొకేషన్ కు ఉన్న మరో ఆకర్షణ. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే ఔరా ప్రాజెక్టు సందర్శించి అద్భుతమైన జీవనానికి నాంది పలకండి

This website uses cookies.