వాణిజ్య రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టేముందు ప్రతి పెట్టుబడిదారుడు ముందుగా డిమాండ్, సరఫరా సూత్రాన్ని అర్థం చేసుకోవాలి. కొత్త అద్దెదారులకు రేట్లు పెరుగుతాయో లేదా అనేది ఇదే నిర్దేశిస్తుంది. ప్రస్తుతం దేశంలో ఆఫీస్ మార్కెట్ కు సంబంధించి నాలుగు నగరాల హవా కొనసాగుతోంది. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, పుణె.. ఇవే ఆ నగరాలు. ఇక్కడ ఆఫీస్ మార్కెట్ జోరుగా దూసుకెళ్తోంది.
2019 నుంచి ఇక్కడ బలమైన సరఫరా వృద్ధి కలిగి ఉంది. 2024, 2025లో దాదాపు 28.7 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ రానుంది. అయితే, 2021లో నెలకొన్న కొన్ని పరిస్థితుల కారణంగా ఆఫీస్ స్పేస్ ఖాళీ 15 శాతం నుంచి 24 శాతానికి పెరిగింది. అదే సమయంలో సరఫరాలో పెరుగుదల కూడా కనిపించింది. అలాగే తెలంగాణ అనియంత్రత ఎఫ్ఎస్ఐ విధానంతోపాటు బెంగళూరు వంటి ఇతర నగరాల నుంచి ఐటీ డిమాండ్ పెరుగుతుందనే అంచనాల నేపథ్యంలో సరఫరాలో పెరుగుదల నమోదైంది.
ఈ నగరం ఓ ప్రసిద్ధమైన గమ్యస్థానంగా ఉంది. అనుకూలమైన డిమాండ్, సప్లై డైనమిక్స్ తో స్థిరమైన మార్కెట్ గా కొనసాగుతోంది. 2024, 2025లో బెంగళూరులో 22.9 మిలియన్ చదరపు అడుగుల కొత్త సరఫరా రానుంది. ఇక్కడ క్యాంపస్ స్టైల్ టెక్ పార్కులు, హౌసింగ్ ఫార్చ్యూన్ 500 ఎంఎన్ సీలు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల వంటివి ఇక్కడ డిమాండ్ పెంచుతున్నాయి. అలాగే ప్రస్తుత మెట్రో కనెక్టివిటీ నిర్మాణం కూడా రియల్ డిమాండ్ పెరగడానికి కారణం. అయితే, సాధారణ నెలవారీ అద్దె రేట్లు ఇప్పటికే చదరపు అడుగుకు రూ.100 చేరుకోవడంతో అద్దెలు ఆకాశన్నంటనున్నాయి.
పెట్టుబడిదారులకు, అద్దెదారులకు విభిన్నమైన అవకాశాలు అందించే నగరం ముంబై. థానే, నవీ ముంలైలో నెలకు చదరపు అడుగుకు రూ.60 అద్దె నుంచి బీకేసీ ప్రాపర్టీల్లో చదరపు అడుగుకు నెలకు రూ.600 వరకు అద్దెలున్నాయి. 2024, 2025లో ముంబైలో సరఫరా విస్తరణ 7.4 మిలియన్ చదరపు అడుగులు ఉండనుంది. ముంబైలో బీకేసీ మార్కెట్ అనేది అధిక అద్దె రేట్లు, క్యాపిటల్ విలువలతో కూడిన ప్రధాన మార్కెట్. కానీ ఇక్కడ చాలా తక్కువ ఖాళీలు ఉంటాయి. పైగా 2025 వరకు సరఫరా కూడా లేదు.
పుణె కూడా అనుకూలమైన డిమాండ్, సప్లై డైనమిక్స్ కలిగి ఉంది. 2024, 2025లో పుణెలో 13.4 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణం రానుంది. ఎస్బీడీ ఈస్ట్ అనేది పుణెలో అతిపెద్ద మైక్రో మార్కెట్. విమానాశ్రయం, సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్.. రెండింటికీ సమీపంలో ఉండటం వల్ల ఈ ప్రదేశంలో డిమాండ్, సరఫరా డైనమిక్స్ కు బాగా ప్రభావితం చేస్తోంది. ఈ మార్కెట్ ప్రస్తుతం దేశంలో అత్యంత బలమైన వాటిలో ఒకటి. ఇక్కడ ఖాళీ రేటు 6 శాతంగా ఉంది.
This website uses cookies.