ఆంధ్రప్రదేశ్ లో మూడు చోట్ల ఐటీ కాన్సెప్ట్ సిటీలు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు ఆ రాష్ట్ర ఐటీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ తెలిపారు. విశాఖపట్నం, తిరుపతి, అనంతపురంలలో వీటిని ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. తద్వారా ఏపీలో ఐటీ అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని పేర్కొన్నారు. ఆయా నగరాల్లో ఉన్న పలు సానుకూలతల దృష్ట్యా వాటిని ఎంచుకున్నట్టు చెప్పారు. ఐటీతోపాటు వైద్యం, విద్య, పర్యాటక, బీమా, బ్యాంకింగు రంగాల్లోని జాతీయ, అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించడమే లక్ష్యంగా ఆయా నగరాలను అభివృద్ధి చేస్తామన్నారు. ఐటీ కాన్సెప్ట్ నగరాల వల్ల ఐటీ కంపెనీలు లబ్ధి పొందుతాయని వివరించారు. ఆయా నగరాల నుంచి హైవేలు, విమానాశ్రయాలకు అంతరాయాలు లేని కనెక్టివిటీ కూడా ఉందన్నారు. ప్లగ్ అండ్ ప్లే ఆఫీస్ స్పేస్, కో వర్కింగ్ స్పేస్ లతోపాటు సమర్థులైన మానవ వనరుల లభ్యత, ప్రపంచ స్తాయి ఐటీ మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు.
This website uses cookies.