poulomi avante poulomi avante

సీబీఐ అరెస్టును తప్పించుకోవాలని..

మొదటి అంతస్తు నుంచి కిందకు దూకిన బిల్డర్
కాలు విరిగి ఆస్పత్రిలో చేరిక 
 
పోలీసులు అరెస్టు చేయడానికొస్తే కుక్కులను వదిలే ప్రబుద్ధులున్న ప్రస్తుత తరుణంలో.. తనను అరెస్టు చేయడానికి వస్తున్న సీబీఐ అధికారుల నుంచి తప్పించుకోవాలనుకున్న ఓ బిల్డర్ సాహసం అతడిని గాయాలపాలు చేసింది. కాలు విరగ్గొట్టుకుని ఆస్పత్రిలో చేరే పరిస్థితి తీసుకొచ్చింది. ఢిల్లీ నుంచి వచ్చి గురుగ్రామ్ టాటా ప్రిమంటి సొసైటీలో నివసిస్తున్న సంజీవ్ కుమార్ అనే బిల్డర్ పై చీటింగ్, అవినీతి కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఆయన్ను అరెస్టు చేయడానికి సీబీఐ అధికారులు కుమార్ ఫ్లాట్ కు వచ్చారు. దీంతో వారి నుంచి తప్పించుకుని పారిపోవడం కోసం తాను ఉంటున్న మొదటి అంతస్తు బాల్కనీ నుంచి కిందకు దూకేశాడు. ఈ క్రమంలో కింద పడి కాలు విరగ్గొట్టుకున్నాడు. వెంటనే సీబీఐ అధికారులు అతడిని అదుపులోకి తీసుకుని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles