తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (ట్రెడా).. అక్టోబరు 1 నుంచి 3వ తేదీ వరకూ.. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో ప్రాపర్టీ షో నిర్వహిస్తోంది. గత పది ఎడిషన్లు విజయవంతంగా పూర్తి చేసిన ట్రెడా.. ఈసారి పదకొండో ప్రాపర్టీ షోను అట్టహాసంగా నిర్వహించడానికి సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా ట్రెడా ప్రధాన కార్యదర్శి సునీల్ చంద్రారెడ్డి మాట్లాడుతూ.. ట్రెడా 11వ ఎడిషన్ ప్రాపర్టీ షోలో.. దాదాపు 150 డెవలపర్లు పాల్గొంటున్నారని.. సుమారు 300 నుంచి 400 ప్రాపర్టీలను ప్రదర్శిస్తున్నామని వెల్లడించారు. భవిష్యత్తు అవసరాల నిమిత్తం 200 గజాల నుంచి 2000 గజాల ప్లాట్లను ఎంచుకోవచ్చని తెలిపారు. నగరం నలువైపులా నిర్మితమవుతున్న లగ్జరీ విల్లాల ప్రాజెక్టుల సమాచారం ట్రెడా 11వ ఎడిషన్ ప్రాపర్టీ షోలో లభిస్తుందన్నారు. గత పదేళ్లలో ప్రాపర్టీ షో ద్వారా అనేక మంది తమ కలల గృహాన్ని ఎంచుకున్నారని.. మరి, ఈసారి కూడా డ్రీమ్ హోమ్ ని ఎంచుకునేవారు తమ ప్రాపర్టీ షోకు విచ్చేయాలని కోరారు. పలు బ్యాంకులు ప్రాపర్టీ షోలో పాల్గొంటున్నాయి కాబట్టి.. ప్లాటు లేదా ఫ్లాటులో ఏదైనా నచ్చితే అక్కడే రుణం తీసుకోవచ్చని తెలిపారు.
This website uses cookies.