తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ఎప్పుడూ వినూత్నంగా ఆలోచిస్తుంది. ప్రతి ప్రాపర్టీ షోలో ఏదో ఒక కొత్త అంశాన్ని పరిచయం చేస్తుంది. సాధారణంగా తమ ప్రాపర్టీ షోలకు చీఫ్ గెస్టులుగా ముఖ్యమంత్రి, సంబంధిత శాఖలకు చెందిన మంత్రుల్ని పిలిచే అలవాటున్న ఈ సంస్థ తాజాగా సరికొత్త రూటుని ఎంచుకున్నది. తెలుగు చిత్ర పరిశ్రమలో పాపులర్ నటుడైన నాగశౌర్యను ఈసారి ట్రెడా ప్రాపర్టీ షోకు ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. అంటే, రొటీన్‌ను బ్రేక్ చేసిన సంస్థగా ట్రెడా సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది. దీంతో, ఇక నుంచి ప్రతి ప్రాపర్టీ షోలకు సినిమా నటులొచ్చే సరికొత్త ట్రెండ్ నగరంలో ఆరంభమైందని చెప్పొచ్చు. కాస్త పేరెన్నిక గల నటుడు కావడంతో అతన్ని అభిమానించే నటులు కూడా వచ్చే అవకాశముంది. మొత్తానికి, ప్రాపర్టీ షోకు గ్లామర్ కళ తెచ్చిన ట్రెడాను సగర్వంగా అభినందించి తీరాల్సిందే.
This website uses cookies.