ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అత్యంత పటిష్టంగా లే అవుట్ రెగ్యులైజేషన్ స్కీమ్ (ఎల్.ఆర్.ఎస్)ను అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. అందులో భాగంగా సచివాలయంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎల్.ఆర్.ఎస్ విధివిధానాలపై పూర్తి స్థాయిలో కసరత్తు నిర్వహించారు.
ఎల్.ఆర్.ఎస్ వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారుకలు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు. ఎల్.ఆర్.ఎస్ అనుమతుల కోసం ప్రజలు చేసుకున్న దరఖాస్తులు వీలైనంత వేగంగా పరిష్కరించాలని ఉప ముఖ్యమంత్రి అధికారులకు సూచన చేశారు. ఇందు కోసం 33 జిల్లాల్లో ప్రత్యేకంగా ఒక టీములను రూపొందుకోవాలని చెప్పారు. సిబ్బంది కొరత ఉంటే ఇతర శాఖల నుంచి డెప్యుటేషన్ తీసుకోవాలన్నారు.
This website uses cookies.