అనధికార లేఅవుట్లలోని ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్లపై తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఎల్ఆర్ఎస్ పై ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతోంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ నిబంధన తీసుకురావటంతో ఆగిపోయిన ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు ఇంకా మోక్షం లభించలేదు. అనుమతులు లేని లేఅవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్‌పై ఉన్న నిషేధాన్ని తొలగించే విషయంలో ప్రభుత్వం ఎప్పుడు, ఎెలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నఉత్కంఠ అందరిలో నెలకొంది.
2020 సెప్టెంబరులో నిలిచిపోయిన అనధికార లేఅవుట్ల రిజిస్ట్రేషన్ల కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. లేఆవుట్లలో ఇప్పటికే ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు నేరుగా ఇంటి నిర్మాణాలకు మాత్రమే అనుమతి తీసుకునేలా నిబంధనలు తీసుకు వస్తున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు ఎల్‌ఆర్‌ఎస్ ఛార్జీలతో పాటు 33 శాతం కాంపౌండ్ ఫీజులు చెల్లించాల్సి ఉంటుందని అంటున్నారు. ఒకటి రెండు శాతం అటూ ఇటుగా కాంపౌండ్ ఫీజు వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
హెచ్‌ఎండీఏ పరిధిలోని ఘట్‌కేసర్, శంషాబాద్, శంకర్‌పల్లి, మేడ్చల్ జోన్లలో సుమమారు 1337 ఇలాంటి అక్రమ లేఅవుట్లను గుర్తించింది ప్రభుత్వం. ఇందులో క్రమబద్ధీకరణకు 628 లేఅవుట్లు అర్హమైనవిగా తేల్చారు అధికారులు. వీటిల్లో 1.31 లక్షల ప్లాట్లు ఉండగా, ఇప్పటి వరకు 40 వేలకు పైగా ప్లాట్లు ఇంకా విక్రయించకుండా మిగిలిపోయాయి. వీటికి ఎల్‌ఆర్‌ఎస్ అవకాశం కల్పించడం వల్ల భవిష్యత్తులో నిర్మాణాలు చేపడితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని తెలుస్తోంది. ఇక తెలంగాణ వ్యాప్తంగా సుమారు 7200 కు వేలకు పైగా ఇంటి స్థలాలకు సంబందించిన వెంచర్లు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి.
అసైన్డ్ భూములు, చెరువుల శిఖం, నీటి వనరుల ప్రాంతంలో, ఎఫ్‌టీఎల్ ఆక్రమించిన భూముల్లో లేఅవుట్లు కోసం హెచ్‌ఎండీఏకు దరఖాస్తు చేసినట్లు గుర్తించారు. ఇలాంటి లేఅవుట్లను ఎల్ఆర్ఎర్ కోసం పరిగణనలోకి తీసుకోవద్దని తెలంగాణ సర్కార్ నిర్ణయించినట్లు సమాచారం. మొత్తానికి ఆగష్టు నెలలో ఎల్ఆర్ఎస్ కు సంబంధించిన ప్రక్రియ మొదలవ్వనుందని అధికారిక వర్గాల సమాచారం.
This website uses cookies.