కొల్లూరులో అన్వితా గ్రూప్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న అన్వితా ఇవానా ప్రాజెక్టుకు సంబంధించిన సెకండ్ ఫేజుకు టీఎస్ రెరా అనుమతి లభించింది. రెండో ఫేజులో భాగంగా.. అన్వితా గ్రూప్ నాలుగు టవర్లను నిర్మించడానికి ప్రణాళికల్ని రచిస్తోంది. మొదటి ఫేజులో పదిహేను అంతస్తుల ఎత్తులో రెండు టవర్లను కడుతుండగా.. సెకండ్ ఫేజులో 36 అంతస్తులవి నాలుగు టవర్లను నిర్మిస్తోంది. రెండు ఫేజుల్లో కలిపి దాదాపు పద్దెనిమిది వందల ఫ్లాట్లను అన్వితా సంస్థ డెవలప్ చేస్తోంది. మొదటి ఫేజులో వచ్చే ఫ్లాట్ల సంఖ్య.. దాదాపు 390. పద్నాలుగు మరియు పదిహేనో అంతస్తులో..
దాదాపు ముప్పయ్ ఊబర్ లగ్జరీ స్కై విల్లాలను డిజైన్ చేశారు. ఫోర్ బెడ్రూమ్ ఫ్లాట్లతో పాటు హోమ్ థియేటర్‌ను కూడా డిజైన్ చేశారు. రెండు ఫేజుల్లో కలిపి సుమారు లక్ష చదరపు అడుగుల్లో క్లబ్ హౌజ్‌ను డెవలప్ చేస్తున్నారు. టెర్రస్ గార్డెన్‌ను నలభై నాలుగు వేల చదరపు అడుగుల్లో డెవలప్ చేస్తున్నారనే విషయాన్ని మర్చిపోవద్దు.
This website uses cookies.