రియల్ ఎస్టేట్ కు సంబంధించిన ఫిర్యాదులు సత్వర పరిష్కారానికి ఆన్‌లైన్ వర్చువల్ హియరింగ్ విధానానికి శ్రీకారం చుట్టామని రెరా (రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ) చైర్మన్ డాక్టర్ ఎన్. సత్యనారాయణ తెలిపారు. ఆయన ఆన్ లైన్ వర్చువల్ హియరింగ్ విధానాన్ని రెరా కార్యాలయంలో సభ్యులు జె. లక్ష్మీనారాయణ, కె. శ్రీనివాస రావులతో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఫిర్యాదు దారుడు ఇచ్చిన అర్జీ మేరకు ఆన్‌లైన్‌లో విచారణ జరిపారు. రెరా పూర్తి స్థాయిలో ఏర్పడిన నలభై రోజుల్లోనే వర్చువల్ హియరింగ్ విధానాన్ని ప్రారంభించామని.. తద్వారా ఫిర్యాదుదారులు ప్రపంచంలో ఎక్కడున్నా.. అందుబాటులో లేని పరిస్థితిలో ఉన్నా.. వృద్యాప్యంలో ఉండి హియరింగ్ కు హాజరు కాలేని పరిస్థితుల్లో ఉన్నా.. ఫిర్యాదుదారుడు ఇచ్చిన అర్జీ మేరకు వర్చువల్ విధానంలో హియరింగుకు హాజరు కావచ్చని అన్నారు. ఈ విధానం ద్వారా ఫిర్యాదులు పరిష్కారం అవుతాయని తెలిపారు. టీఎస్ రెరా ఛైర్మన్ ను నియమించిన నలభై రోజుల్లోపు ఆన్‌లైన్ హియరింగ్ విధానాన్ని ప్రవేశపెట్టడం పట్ల బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల బిల్డర్లు, ప్రమోటర్ల చేతిలో మోసిపోయిన వారికి సత్వర న్యాయం లభించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.
This website uses cookies.