నవంబర్ 25, 26వ తేదీల్లో నిర్వహణ
ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల, అనిశ్చితి పరిస్థితులు ఉన్నప్పటికీ, భారతీయ ప్రాపర్టీ మార్కెట్ 2023లో విశేషమైన వృద్ధిని సాధించింది. భారత్ లోని భవిష్యత్ గృహాలలో పెట్టుబడి పెట్టే ప్రవాస భారతీయుల ఆసక్తి గణనీయంగా పెరిగింది. దేశంలోని వాణిజ్య ప్రాపర్టీ కూడా ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల కాలంలో దూకుడు ప్రదర్శించింది. ఈ నేపథ్యంలో రియల్ రంగంలో ప్రస్తుత ట్రెండ్ ఎలా ఉంది? 2024లో రియల్ రంగం ఎలా ఉండబోతోంది అనే అంశంపై నవంబర్ 25, 26వ తేదీల్లో దుబాయ్ లోని హోటల్ బిజినెస్ బే లో ‘ది యూఏఈ-ఇండియా రియల్ ఎస్టేట్ షో 2023‘ సదస్సును ఖలీజ్ టైమ్స్, రియాల్టీ ప్లస్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. రెండు దేశాలకు చెందిన ప్రముఖ డెవలపర్లతోపాటు ఇండియా, యూఏఈలకు చెందిన సీనియర్ ప్రభుత్వ అధికారులు ఈ సదస్సుకు హాజరవుతారు. సదస్సులో పలు అంశాలపై సమగ్రంగా చర్చిస్తారు. అలాగే 50 మందికి పైగా డెవలపర్లు తమ ప్రాపర్టీలను ప్రదర్శిస్తారు. యూఏఈ డెవలపర్లు, ఏజెంట్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. సదస్సుకు వచ్చినవారు ఆన్ ది స్పాట్ బుకింగ్ డిస్కౌంట్లు పొందొచ్చు. అలాగే ప్రతి గంటకూ అనేక బహుమతులతో కూడిన మెగా రాఫిల్, ప్రతి సందర్శకుడికి 500 ధిరమ్స్ వోచర్ ఇస్తారు. అలాగే కాంప్లిమెంటరీ ఎఫ్అండ్ బీ లాంజ్ యాక్సెస్ కూడా ఉంది.
This website uses cookies.