ఉత్తరప్రదేశ్ రియల్ ఎస్టేట్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (యూపీ రెరా) ఇకపై రెండు షిఫ్టుల్లో పని చేయాలని నిర్ణయం తీసుకుంది. ఒకటో నెంబర్ బెంచ్ మధ్యాహ్నం 1.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, రెండో నెంబర్ బెంచ్ ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పని చేయనుంది. అందరికీ అనుకూలంగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు జాయింట్ రిజిస్ట్రార్ ఓ ప్రకటనలో తెలిపారు.