సౌతిండియాలోనే అతిపెద్ద
కమ్యూనిటీ ఎల్‌బీ నగర్‌లో!
విస్తీర్ణం: 29.37 ఎకరాలు
33 అంతస్తులు.. 3,576 ఫ్లాట్లు
రెండు క్లబ్ హౌజులు..
ఆధునిక సదుపాయాలకు పెద్దపీట
హైదరాబాద్‌లో ఆధునిక గేటెడ్ కమ్యూనిటీల్లో అత్యాధునిక సదుపాయాల్ని ప్రవేశపెడుతున్న సంస్థల్లో వాసవి గ్రూప్ ముందంజలో ఉంటుంది. నగరం నలువైపులా ప్రాజెక్టులను చేపడుతున్న సంస్థగా.. కొనుగోలుదారుల మన్ననలను పొందుతున్న ఈ సంస్థ.. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీ ‘‘ఆనంద నిలయం’’ ను ఆరంభించింది. నిర్మాణ పనులూ జోరుగా జరుగుతున్నాయి. దాదాపు 29.37 ఎకరాల విస్తీర్ణంలో.. సుమారు 33 అంతస్తుల ఎత్తులో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో మొత్తం పదకొండు టవర్లను నిర్మిస్తున్నారు.
ఇంత బడా ప్రాజెక్టులో ఒక క్లబ్ హౌజ్ నివాసితులకు సరిపోదనే ఉద్దేశ్యంతో.. రెండు క్లబ్ హౌజులకు స్థానం కల్పించింది. సుమారు 1.31 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అభివృద్ధి చేస్తోంది. 2, 3, 4 పడక గదులకు పెద్ద పీట వేసిన ఈ ప్రాజెక్టులో.. సుమారు 112 స్కై విల్లాలను తీర్చిదిద్దింది. దాదాపు ముప్పయ్ ఎకరాల విస్తీర్ణంలో డిజైన్ చేసిన ఆనంద నిలయంలో నిర్మాణం వచ్చేది కేవలం 28 శాతం స్థలంలోనే. మిగతా 72 శాతాన్ని ఓపెన్ స్పేస్‌గా వదిలేశారు.
ప్రత్యేక కాన్సెప్టు
వాసవి సంస్థ .. ఈ ఆకాశహర్మ్యాన్ని కాన్సెప్టు ఓరియెంటెడ్ గా తీర్చిదిద్దింది. మొత్తం ప్రాజెక్టులో తివాచీ పర్చినట్లుగా పచ్చదనం దర్శనమిస్తుంది. ల్యాండ్ స్కేపింగ్ కోసమే ప్రత్యేకంగా ఒక కాన్సెప్టుకు శ్రీకారం చుట్టింది. ప్రాజెక్టులోని ప్రవేశమార్గం ప్రతిఒక్కరినీ ఆకట్టుకునేలా కనిపిస్తుంది. డిజైనింగ్‌లో వాసవి సంస్థ రాజీపడలేదని చెప్పడానికిదే నిదర్శనమని చెప్పొచ్చు. ప్రవేశమార్గంలోనే ఒక ప్రత్యేక ఫౌంటెయిన్‌ను పెట్టడం వల్ల సాయంత్రం కాగానే పెద్దలు, మహిళలు కలిసికట్టుగా కూర్చోని కబుర్లు చెప్పకుంటూ సేదతీరే వీలు కలుగుతుంది. ఎవెన్యూ రోడ్లు కానీయండి.. ప్రాజెక్టులోకి ప్రవేశించే మార్గం వంటివాటిని ప్రత్యేకంగా డిజైన్ చేసింది.