Categories: TOP STORIES

మియాపూర్‌లో బడా గేటెడ్ క‌మ్యూనిటీ ఆరంభం

ప్ర‌జ‌ల అభిరుచి మేర‌కు ప్రాజెక్టుల‌ను నిర్మించ‌డం వ‌ల్లే.. ముప్ప‌య్యేళ్ల నుంచి కొనుగోలుదారులు త‌మ‌ను ఆద‌రిస్తున్నార‌ని వ‌ర్టెక్స్ హోమ్స్ ఎండీ వెంక‌ట‌రాయ‌వ‌ర్మ తెలిపారు. ఆదివారం మియాపూర్‌లో వ‌ర్టెక్స్ విరాట్ ప్రాజెక్టును ఆరంభించిన సంద‌ర్భంగా ఆయ‌న రెజ్ న్యూస్‌తో ప్ర‌త్యేకంగా మాట్లాడుతూ.. బ‌య్య‌ర్లు ఆనందించేలా అపూర్వ‌మైన విలువ‌ల్ని జోడిస్తూ.. ప్ర‌తి చిన్న అంశాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని.. మియాపూర్‌లోని వర్టెక్స్ విరాట్ ప్రాజెక్టును డిజైన్ చేశామ‌న్నారు. మియాపూర్లో అతి పెద్ద గేటెడ్ క‌మ్యూనిటీని ఆరంభించామ‌ని.. మార్కెట్ ప‌రిస్థితుల‌తో సంబంధం లేకుండా.. ఈ ప్రాంతంలో ఫ్లాట్ల‌కు అన్నివేళ‌లా గిరాకీ ఉంటుంద‌న్నారు. ఆవ‌ర‌ణ‌లోకి వ‌చ్చే వాహ‌నాలు నేరుగా సెల్లార్లోకి వెళ‌తాయ‌ని.. గ్రౌండ్ ఫ్లోర్‌ను వెహికిల్స్ ఫ్రీ జోన్‌గా తీర్చిదిద్దామ‌ని తెలిపారు.

* వ‌ర్టెక్స్‌ హోమ్స్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మురళీమోహన్‌ మాట్లాడుతూ ‘‘కొనుగోలుదారుల‌కు ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌నాన్ని అందించాల‌న్న ఉద్దేశ్యంతో.. ఓపెన్ జిమ్‌, ప్లే ఏరియాలు, యోగా కేంద్రాలు మొద‌లైన‌వి విరాట్ ప్రాజెక్టులో పొందుప‌రిచామ‌న్నారు. అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని.. క్రీడ‌లు, క‌ళ‌లు, సంస్కృతిని ప్రోత్స‌హించే విధంగా.. ఈ అత్యాధునిక గేటెడ్ క‌మ్యూనిటీని తీర్చిదిద్దామ‌న్నారు. ఈ ప్రాజెక్టు నుంచి న‌డుచుకుంటూ అలా మెట్రో రైల్వే స్టేష‌న్ కు చేరుకోవ‌చ్చ‌ని చెప్పారు. వ‌ర్టెక్స్ విరాట్‌కు రెండు ఎంట్రీలు, మూడు ఎగ్జిట్‌లు ఉంటాయ‌న్నారు.

* వ‌ర్టెక్స్ హోమ్స్ డైరెక్ట‌ర్ ప్ర‌వీణ్ వ‌ర్మ మాట్లాడుతూ.. మియాపూర్‌లోని అతిపెద్ద గేటెడ్ క‌మ్యూనిటీయే వ‌ర్టెక్స్ విరాట్ అని.. బాక్స్ క్రికెట్‌ జోన్‌, ఫుట్సల్ కోర్ట్‌, పెట్స్ పార్క్ మొదలైన సదుపాయాల్ని క‌ల్పిస్తున్నామ‌ని తెలిపారు. వ‌ర్టెక్స్ విరాట్ ప్రాజెక్టును ఎక్స్‌ట్రా ఎడ్జ్ హోమ్స్ గా అభివ‌ర్ణించారు.
అత్యుత్తమ డిజైన్‌, నాణ్యత మరియు పనితనం అందించడంపై దృష్టి సారిస్తున్నామ‌ని చెప్పారు. స్టిల్ట్ ప్ల‌స్ 30 అంత‌స్తుల ఎత్తులో ఆరు ట‌వ‌ర్ల‌ను నిర్మిస్తున్నామ‌ని తెలిపారు. ఆధునిక ఆర్కిటెక్చ‌ర్‌కు ప్ర‌తిబింబంగా ఈ ప్రాజెక్టు నిలుస్తుంద‌న్నారు.

* ప్రాజెక్టు ఆవిష్క‌ర‌ణ సంద‌ర్భంగా న‌గరానికి చెందిన ప‌లువురు డెవ‌ల‌ప‌ర్లు విచ్చేసి వ‌ర్టెక్స్ హోమ్స్ యాజ‌మాన్యానికి శుభాకాంక్ష‌లు తెలిపారు. క్రెడాయ్ హైద‌రాబాద్ అధ్య‌క్షుడు రామ‌కృష్ణారావు, కోశాధికారి ఆదిత్యా గౌరా, నరెడ్కో తెలంగాణ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య్‌సాయి, మాజీ అధ్య‌క్షుడు చ‌లప‌తిరావు, మారం స‌తీష్ త‌దిత‌రులు పాల్గొన్నారు. ప్రాజెక్టు ఆవిష్క‌ర‌ణ సంద‌ర్భంగా కొనుగోలుదారులు, సంద‌ర్శ‌కుల‌తో ప్రాజెక్టు ఆవ‌ర‌ణ కిట‌కిట‌లాడింది.

This website uses cookies.