హైదరాబాద్ చేరువలో టూరిస్ట్ స్పాట్ అంటే.. ప్రతిఒక్కరికీ గుర్తుకొచ్చేది అనంతగిరి కొండలు. ఈ ప్రాంతాన్ని మినీ ఊటిగా అభివర్ణించొచ్చు. వికారాబాద్ మినీ హిల్ స్టేషన్ కావడంతో ప్రకృతి ప్రేమికుల్ని మంత్రముగ్దుల్ని చేస్తుంది. ఈ కారణంగానే చాలామంది ఇక్కడో ఫామ్ హౌస్ కట్టుకోవాలని.. వారాంతాల్లో వచ్చి కుటుంబంతో గడపాలని భావిస్తున్నారు. ఇలాంటి వారందరి కోసమే.. వికారాబాద్‌లో ఏయే ప్రాంతాల్లో ఎంతెంత ధరలున్నాయో.. ప్లాట్ల రేట్లు ఎంత చెబుతున్నారో ప్రత్యేకంగా అందజేస్తున్నాం.
మూసీ నది జన్మస్థలమైన అనంతగిరి కొండల్ని చూసి ప్రకృతి ప్రేమికులు ఇట్టే ఆకర్షితులౌతారు.
ఇక్కడే అనంత పద్మనాభస్వామి ఆలయం ఉండటంతో సందర్శకుల్ని ఆకర్షిస్తుంది. ఈ జిల్లా అనేక ఇతర దేవాలయాలకు నిలయమని చెప్పొచ్చు. కోటిపల్లి, జున్టుపల్లి, లక్నాపూర్, సర్పన్ పల్లి వంటివి పర్యాటకుల్ని ఇట్టే ఆకర్షిస్తున్నాయి. గచ్చిబౌలి నుంచి రోడ్డు మార్గంలో కేవలం గంటలో చేరుకునే వికారాబాద్లో రియల్ ఎస్టేట్ కొంతకాలం నుంచి ప్రతిఒక్కర్ని విశేషంగా ఆకర్షిస్తోంది. అందుకే, ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. కనీసం వారాంతాల్లో వచ్చి అయినా ఇక్కడి ప్రకృతి ఒడిలో సేదతీరాలని భావించేవారి సంఖ్య ఇటీవల కాలంలో పెరిగింది.
వికారాబాద్ జిల్లాలో మొత్తం పద్దెనిమిది మండలాలు ఉండగా.. జనాభా దాదాపు పది లక్షల దాకా ఉంటుంది. వికారాబాద్, తాండూరు అని రెండు రెవెన్యూ డివిజన్లుగా మార్చారు. మరి, ప్రస్తుతం ఇక్కడి కొన్ని మండలాల్లో భూముల ధరలు ఎకరానికి ఎంతెంత ఉన్నాయంటే..
ప్రాంతం | కనీస | గరిష్ఠ (రూ.లక్షల్లో) |
వికారాబాద్ | 1.40 కోట్లు | 2.50 కోట్లు |
గిరిగిట్ పల్లి | 45 | 70 లక్షలు |
మర్పల్లి | 30 | 50 లక్షలు |
మోమిన్ పేట్ | 50 | 1.50 కోట్లు |
పూడురు | 40 | 2 కోట్లు |
కుల్కచర్ల | 24 | 53 |
దోమ | 30 | 50 |
పరిగి | 35 | 1.5 కోట్లు |
ధారూరు | 35 | 60 లక్షలు |
కోటిపల్లి | 35 | 60 లక్షలు |
బంట్వారం | 25 | 75 లక్షలు |
నవాబుపేట్ | 65 | 2.5 కోట్లు |
కేవలం అవగాహన కోసమే ఈ పట్టిక. కొన్ని ప్రాంతాల్లో మెయిన్ రోడ్డులో ఉన్న భూముల ధరల్లో తేడా ఉంటుంది. స్థల యజమాని అవసరం, బయ్యర్ చెల్లింపు సామర్థ్యం బట్టి తుది ధరలో మార్పు ఉంటుందని గుర్తుంచుకోండి.
వికారాబాద్లో ప్లాట్ల ధరలివే! (టేబుల్)
ప్రాంతం | ధర (గజాల్లో) |
మధు కాలనీ | 15000-20000 |
రామయ్యగూడ | 8000-12000 |
ఇంద్రానగర్ కాలనీ | 10000-15000 |
సాకేత్ నగర్ | 12000-18000 |
కార్తికేయ నగర్ | 14000-18000 |
సూర్యప్రకాష్ శాటిలైట్ కాలనీ | 16000-18000 |
బృంగీ స్కూల్ ఎదురుగా | 16000-18000 |
మేఘన టౌన్ షిప్ | 7500-9000 |
ఆలంపల్లి రోడ్డు వైపు | 18000- 24000 |
This website uses cookies.