ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ నిబంధనలకు విరుద్ధంగా రెసిడెన్షియల్ ప్రాజెక్టులో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నందుకు రెండు అపార్ట్ మెంట్లలోని 21 అంతస్తులను గురుగ్రామ్ జిల్లా టౌన్ ప్లానర్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు సీజ్ చేశారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ తీసుకున్న తర్వాత పలువురు నిర్మాణదారులు ఆయా భవనాల్లో అక్రమ కట్టడాలకు పూనుకున్నారని అధికారులు తెలిపారు. దీంతో పలు భవనాలను పరిశీలించి చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు. ఇందులో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా రెసిడెన్షియల్ భవనంలో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్న సుశాంత్ లోక్-1 అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ లోని 21 అంతస్తులను సీజ్ చేసినట్టు వివరించారు. అలాగే మలిబు టౌన్ క్లబ్ లో అక్రమ నిర్మాణాలు చేస్తున్నందుకు దానిని కూడా సీజ్ చేసినట్టు ప్రకటించారు.
This website uses cookies.