poulomi avante poulomi avante

కిషోర్ కుమార్ బంగ్లాలో విరాట్ రెస్టారెంట్..

  • ముంబై జుహూలో వన్ 8 కమ్యూన్ ప్రారంభించిన కోహ్లీ

ప్రముఖ క్రికెటర్, టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీకి ఫుడ్ అండ్ బేవరేజెస్ వ్యాపారం కొత్తేమీ కాదు. కానీ ఆయన ఈ వ్యాపారాన్ని మరింత విస్తృతం చేసి ఓ సామ్రాజ్యాన్నే నిర్మించే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల విరాట్ తన వన్8 కమ్యూన్ రెస్టారెంట్ కు చెందిన ఓ కొత్త బ్రాంచి ప్రారంభించారు. ఇందులో ఆకర్షణీయమైన అంశం ఏమిటంటే.. ముంబై జుహూలోని దివంగత కిషోర్ కుమార్ పాత బంగ్లాలో ఈ రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. విరాట్ సెలబ్రిటీ కావడంతో ఆయన రెస్టారెంట్ కు వినియోగదారులు వెల్లువలా వస్తున్నారు. మరి విరాట్ రెస్టారెంట్ లో ఇంటీరియర్ ఎలా ఉంది? ఎలాంటి ఆకర్షణీయమైన డెకర్ ఉందో చూద్దామా?

లోపలకు అడుగు పెట్టిన తర్వాత ఔరా అని అనిపించక మానదు. అంత అందంగా దానిని తీర్చిదిద్దారు. విరాట్ 18వ నంబర్ పెద్ద జెర్సీ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఔట్ డోర్, ఇన్ డోర్ థీమ్ లో పలు చోట్ల ఫుడ్ సర్వ్ చేసేలా చక్కగా ఏర్పాట్లు చేశారు. ఓ చోట పెద్ద గోడపై విరాట్ సంతకం అదిరిపోయేలా డిజైన్ చేశారు. ఈ రెస్టారెంట్ ను ఓ ప్రత్యేకమైన సందర్భంతో రూపొందించారు. ముంబై నగరం, పరిసరాలు, ప్రజలు ఇలా.. అన్నీ ప్రతిబింబించేలా ఉంటాయి. సరిగ్గా చెప్పాలంటే దివంగత కిషోర్ కుమార్ కు నివాళి అర్పించేలా ఉంటుంది. ప్రతి ఒక్కరూ కాస్త విశ్రాంతి తీసుకోవడానికి, హాయిగా సేద తీరడానికి మంచి స్థలం అనడంలో ఎలాంటి సందేహం లేదు. విరాట్ ఈ రెస్టారెంట్ ప్రారంభించడానికి ముందు చాలా కసరత్తే చేశారు. పలు చోట్ల పర్యటించి, లక్షలాది అంశాలు, లక్షలాది మంది ప్రజలను పరిశీలించి డిజైన్ విషయంలో తుది నిర్ణయానికి వచ్చారు. టేబుల్స్, కుర్జీలు, వాటిలో కుషన్లు.. ఇలా అన్నింటిపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. ఇంకా పచ్చని మొక్కలు, చెక్కతో కవర్ చేసిన గోడలతో ఇంటీరియర్ ను అద్భుతంగా తీర్చిదిద్దారు.

ఇక రెస్టారెంట్ మెనూ శాఖాహారానికి అనుకూలమైనది. కల్ట్ స్నాక్స్.. పాత, కొత్త రుచుల సమ్మేళనంతో వైవిధ్యభరితంగా ఉంది. అంతేకాకుండా ప్రపంచంలోని అత్యుత్తమ రుచులను అందించేదిగా ఉంది. సాధారణ వెరైటీల కంటే ఎక్కువ ఐటమ్స్ పొందుపరిచారు. పోక్ బౌల్స్, టారో లీఫ్ వాడి, ఫెన్నెల్ స్టూతో కూడిన కాటేజ్ చీజ్ స్టీక్, మహారాష్ట్ర లాంబ్ కర్రీ వంటి నోరూరించే ఆహారం అందుబాటులో పెట్టారు. కొల్హాపూర్ నుంచి సుగంధ ద్రవ్యాలు, గుజరాత్ నుంచి భావనాగ్రి మిర్చి, నేపాల్ నుంచి పచ్చళ్లు.. ఇలా అన్ని కమ్యూనిటీలకు అందించే విధంగా రకరకాల ప్రదేశాల నుంచి తెప్పించారు
రెస్టారెంట్ సంప్రదాయమైన థీమ్ తో కాకుండా అందరికీ ఓ స్నేహపూర్వకమైన స్థలంగా తీర్చిదిద్దడంపైనే విరాట్ ఎక్కువగా దృష్టి పెట్టారు. ఇందుకోసం తొలుత ఇంటీరియర్ డిజైనర్ సాయంతో విజువలైజేషన్ చేసి చూశారు. అనంతరం నచ్చిన అంశాలను ఎంపిక చేసి డిజైన్ కు తుది రూపు ఇచ్చారు. ‘ఇది రాతి గోడలతో చేసిన గాజు ఇల్లు. ఎందుకంటే విరాట్ తన దేశం సాంస్కృతిక గుర్తింపును బాగా ఇష్టపడతారు. ఈ రంగులు దేశంలోని ఎత్తైన ప్రాంతాల నుంచి వచ్చాయి. ఈ స్థలాన్ని చాలా అంటే చాలా ప్రత్యేకమైనదిగా తీర్చిదిద్దే విషయంలో విరాట్ చాలా మొండిగా ఉన్నారు.
ఇక లోపల అద్దాలతో ఏర్పాటు చేసిన గ్లాస్ హౌస్ చాలా అందంగా ఉంటుంది. అందులో కూర్చుని నీలాకాశాన్ని చూస్తూ ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. మరి అలాంటి ప్లేస్ ఎవరికి నచ్చదు చెప్పండి’ అని ఇంటీరియర్ డిజైనర్ ప్రశ్నించారు. ఎర్త్ టోన్లు, టెక్చర్లను కలిపి కోహ్లీ కొన్ని మోల్డింగులు, పురాతన ఫర్నిచర్ చేర్చారు. విరాట్ పదేపదే చెప్పినట్టుగా.. ఆహ్వానించతగ్గ వాతావరణం, కొంత సౌందర్యంపైనే దృష్టి పెట్టి అద్భుతమైన రెస్టారెంట్ రూపొందించారు. తన పేరును, అదృష్టాన్ని వ్యాపార వేదికపై వినియోగించుకోవడానికి ఇదో మంచి మార్గం. అదే సమయంలో ఆయన స్పాట్ లైట్ నుంచి మారుతున్నట్టు అనిపిస్తున్నప్పటికీ.. అటు ఆట, ఇటు వ్యాపారం.. ఈ రెండు రంగాల్లోనూ మెరుస్తూనే ఉంటారు
spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles