Categories: LATEST UPDATES

కాలుష్య నగరాల్లో వైజాగ్ దేశంలో 13వ స్థానం

వాయు కాలుష్య నివారణకు 2019 జనవరిలో పర్యావరణ అటవీ,వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అంటే ఎన్ సీ ఏ పీ ని ప్రారంభించింది. విశాఖపట్టణం ఎన్సీఏపీ పరిధిలోని 30 కాలుష్య నగరాల్లో 13వ స్థానంలో నిలిచింది. వైఎస్ఆర్ సీపీ ఎంపీ పరిమిళ్ నత్వానీ అడిగిన ప్రశ్నకు అటవీ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ గురువారం రాజ్యసభలో సమాధానం చెప్పారు. గాలిలో పార్టిక్యులేట్ మ్యాటర్ .. పీఎం10 అత్యధిక సగటు సాంద్రత ఉన్న టాప్ నగరాల్లో వైజాగ్ నిలిచింది. నేషనల్ ఎయిర్ క్లీన్ ప్రోగ్రామ్ లో ఏపీకి చెందిన 11 నగరాలకు చోటు వాయు కాలుష్య నివారణకు 2019 జనవరిలో పర్యావరణ అటవీ,వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అంటే ఎన్ సీ ఏ పీ ని ప్రారంభించింది. గాలిలో పార్టిక్యులేట్ మ్యాటర్ సాంధ్రతను 40 శాతం వరకు 2026 నాటికి తగ్గించాలనే లక్ష్యంగా పెట్టుకుంది.

దేశంలోని 132 నగరాలను ఈ ఎన్ సీ ఏ పీ కింద ఎంపిక చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ కి చెందిన విజయనగరం, ఏలూరు, శ్రీకాకుళం, గుంటూరు, విజయవాడ, అనంతపురం, చిత్తూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, కడప నగరాలకు చోటు దక్కింది., సీఆర్ ఈ ఏ రిపోర్ట్ మేరకు ఇండియాలో అత్యంత కాలుష్య నగరాలివే సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ సంస్థ విడుదల చేసిన రిపోర్ట్ మేరకు మేఘాలయాలోని బైర్నిహట్ అత్యంత కాలుష్య నగరంగా టాప్ 1లో నిలిచింది. హర్యానాలోని ఫరిదాబాద్ రెండో స్థానంలో ఉంది. దిల్లీ, గురుగామ్, భగల్ పూర్, శ్రీ గంగానగర్, గ్రేటర్ నోయిడా, ముజఫర్ నగర్, బల్లభ్ ఘర్, భివండీ లు వరుస స్థానాల్లో నిలిచాయి. నేషనల్ యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ కింద ప్రతి రోజూ గాలిలో పీఎం 10 క్యూబిక్ మీటర్ కు 60 గ్రాములుండాలి. కానీ.. పరిమితికి మించి గాలిలో కాలుష్యం నమోదైందని ఈ రిపోర్ట్ వెల్లడించింది.

2024 జనవరి నుంచి జూన్ వరకు ఆయా నగరాల్లో గణాంకాల ఆధారంగా ఈ రిపోర్ట్ ను విడుదల చేశారు. 37 నగరాల్లో కాలుష్యం ఎక్కువే ఎన్సీఏపీ కింద చేరిన నగరాల్లో కూడా కాలుష్యం తగ్గలేదు. ఈ డేటా ప్రకారంగా సుమారు 78 నగరాల్లో పీఎం10 క్యూబిక్ మీటర్ కు 60 మైక్రోగ్రాములుగా నమోదైందని గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో 37 నగరాలు నేషనల్ ఎయిర్ క్లీన్ ప్రోగ్రామ్ వార్షిక లక్ష్యాలను సాధించలేకపోయాయని ఆ నివేదిక తెలుపుతోంది. కాలుష్యం తగ్గించేందుకు ప్రజా రవాణకు ప్రోత్సాహం కాలుష్యం తగ్గించేందుకు 2020 ఏప్రిల్ 1 నుంచి బీఎస్ -6 వాహనాలను ప్రవేశ పెట్టారు. ఇంధన వినియోగం, కాలుష్యాన్ని తగ్గించడానికి ఎక్స్ ప్రెస్ వేలు, హైవేల అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు. సిఎన్ జి, ఎల్ పిజి వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారు. పెట్రోల్ లో ఇథనాల్ కలపడం వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రవేశపెట్టే దిశగా ప్రణాళికలను సిద్దం చేస్తున్నారు. మెట్రో రైళ్లు, ప్రభుత్వ రవాణను ప్రోత్సహించాలని ప్రభుత్వం తలపెట్టింది. సౌకర్యమైన జీవనం కోసం చేస్తున్న ప్రయత్నాలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కాలుష్యానికి దోహదపడుతున్నాయి. కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వాలకు ప్రజలు కూడా తమ తోడ్పాటును అందించాల్సిన అవసరం ఉంది.

This website uses cookies.