Categories: LATEST UPDATES

చిన్న ప్లాట్ల విక్రయానికి వీఎంఆర్డీఏ మొగ్గు

  • పెద్ద స్థలాలకు స్పందన కరువు కావడంతో ఈ నిర్ణయం

పెద్ద స్థలాల అమ్మకాలకు స్పందన కరువు కావడంతో విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్ మెంట్ అథార్టీ (వీఎంఆర్డీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి విశాఖపట్నంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 24 ఎకరాల స్థలాన్ని చిన్నచిన్న ప్లాట్లుగా చేసి విక్రయించాలని నిర్ణయించింది. ఈ మేరకు అవసరమైన అనుమతులు కూడా తీసుకుంది. మధురవాడ, కాపులుప్పాడ, అనకాపల్లి, భీమునిపట్నం వంటి ప్రాంతాల్లో ఉన్న భూములను అమ్మాలని వీఎంఆర్డీఏ నిర్ణయించింది.

చదరపు గజం ధరను రూ.8వేల నుంచి రూ.40 వేల మధ్య నిర్ణయించింది. గతేడాది సెప్టెంబర్లో అమ్మకం ప్రక్రియ నిర్వహించాల్సి ఉంది. కనీసం ఈ ధరకే ఆ భూములన్నీ అమ్ముడైతే వీఎంఆర్డీఏకి రూ.175 కోట్ల ఆదాయం వచ్చేది. అయితే, పలుమార్లు దరఖాస్తు గడువు పొడిగించినా స్పందన కనిపించలేదు. ఒక్కో ప్రాంతంలో కనీసం ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. ఈ నేపథ్యంలో ఆ భూములను చిన్నచిన్న ప్లాట్లుగా వేసి విక్రయించాలని వీఎంఆర్డీఏ నిర్ణయించింది.

This website uses cookies.