సొంతిల్లు కట్టుకునే ప్రతిఒక్కరికి టైల్ అవసరమే. మరి, కొత్తగా ఇల్లు కట్టుకునేవారికి ఏయే రకం టైల్ వాడాలో తెలియదు. టైళ్లలో ఉన్న సైజులెన్నో తెలియదు. హాల్, డైనింగ్, లివింగ్, బెడ్ రూమ్.. ఇలా ప్రతి ప్రాంతాన్ని అందంగా తీర్చిదిద్దుకోవడానికి మన మార్కెట్లో అందుబాటులో ఉన్న టైళ్ల రకాలేమిటి? అవి ఏయే సైజుల్లో లభిస్తున్నాయి? ఏయే రకాల టైళ్లు ఎక్కడ వేసుకోవాలి? వాటి ధరలెలా ఉన్నాయి?
ప్రాథమిక భారతీయ సిరామిక్ టైల్ ఏ సైజు? ధర (అడుక్కీ) 300×450ఎంఎం (12″×18″) 35 – 50
300×600ఎంఎం (2’x 1′) 50 – 75
300×300 ఎంఎం (1’x1′) 35 – 50
(సిరామిక్ ఫ్లోర్ రకం)
విట్రిఫైడ్ ఫ్లోర్ టైల్ – డబుల్ ఛార్జ్డ్ 600×600ఎంఎం (2’x2′) 45 – 60
800×800ఎంఎం (32″×32″) 55 – 70
1000×1000ఎంఎం (3.25′ x 3.25′) 80 – 95
జీవీటీ గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ (మ్యాట్/ రస్టిక్ ఫినిష్) 600×600 ఎంఎం (2’x2′) 55 – 170
800×800 ఎంఎం (32″×32″) 60 – 170
600×1200 ఎంఎం (2’x4′) 75 – 185
1200x 1200 ఎంఎం (4’x4′) 100 – 220
800 x1600 ఎంఎం (32″×64″) 110 – 205
1200×2400 ఎంఎం (8’x4′ ) 240 – 340
పాలిష్డ్ గ్లేజ్డ్ విట్రీఫైడ్ టైల్స్ (పీజీవీటీ) 600×600 ఎంఎం (2’x2′) 55 – 170
800×800 ఎంఎం (32″×32″) 60 – 245
600×1200 ఎంఎం (2’x4′) 75 – 245
1200x 1200 ఎంఎం (4’x4′) 100 – 245
800 x1600 ఎంఎం (32″×64″) 110 – 280
1200×2400 ఎంఎం (8’x4′ ) 240 -390
ఎక్కడ వేస్తారు? జీవీటీ మ్యాట్, రస్టిక్ ఫినిష్ రకాల టైళ్లను ఎక్కువగా బాత్ రూము ఫ్లోర్లు, బాల్కనీలు, కారిడార్లు, కమర్షియల్ ప్రాంతాలు, ఎక్స్ టీరియర్ క్లాడింగ్, అధిక ట్రాఫిక్ గల ఏరియాల్లో వాడతారు. జీవీటీ టైళ్లను ఎక్కువగా లివింగ్ రూమ్, బెడ్ రూమ్ ఫ్లోరింగ్, బాత్ రూమ్ గోడలు, ఫ్లోరింగ్, ఎలివేషన్లో వినియోగిస్తారు. పీజీవీటీ (పాలిష్డ్ గ్లేజ్డ్ విట్రిఫైడ్) రకాలు ఎక్కువగా నివాస భవనాల ఫ్లోరింగ్, ఎలివేషన్లలో వాడతారు. ఏయే సైజు టైలు.. ఎక్కడెక్కడ? ఇల్లు కట్టే ప్రతిఒక్కరిలో కలిగే ప్రాథమిక సందేహమిది. దీన్ని తీర్చేందుకు
హోమ్ 360 డిగ్రీస్ కు మీకు కొన్ని ఆప్షన్లు చెబుతోంది. అవేమిటో మీరే చూడండి.
ఆప్షన్ 1- హాల్/లివింగ్ రూము, కిచెన్ 4’x4′ సైజు టైళ్లను వాడొచ్చు. పడక గదుల్లో 32″×32″ . ఆప్షన్ 2 హాల్/లివింగ్ రూము, కిచెన్ 32″×32″ సైజు టైళ్లు. పడక గదుల్లో 2’x2′ . ఆప్షన్ 3 హాల్/లివింగ్ రూము, కిచెన్ 32″×64″ సైజు టైళ్లు. పడక గదుల్లో 2’x4′ ఆప్షన్ 4 పెద్ద హాళ్లు/లివింగ్ రూము, కిచెన్ 8’x4′ సైజు టైళ్లు. పడక గదుల్లో 4’x4′ చిన్న బాత్ రూముల్లో 12″ x18″ & 2’x1′ సిరామిక్ టైళ్లు, వాష్ ఏరియాలో కూడా. బడా బాత్ రూముల్లో పీజీవీటీ, జీవీటీ 2’x4′ , 4’x4′ , 6’x4′ & 8’x4′ సైజులవి వాడొచ్చు. ఖరీదైన బంగళాలు, విల్లాల్లో వీటిన వేస్తారు. వివరాలకు-
హోమ్ 360 డిగ్రీస్ జూబ్లీహిల్స్ రోడ్ నెం.40.
మొబైల్ +919948078659
మెయిల్: admin@home360degree.com
Subscribe to updates Unsubscribe from updates