గోద్రేజ్ ఇంటీరియో భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ వ్యాపారాన్ని మెరుగు పర్చుకుంటోంది. దేశవ్యాప్తంగా పెరిగిన కరోనా నేపథ్యంలో గత ఏడాది నుంచి ఉత్పత్తి సామర్థ్యం పెంచింది. ప్రతిరోజు రెండున్నర పడకలను అధికంగా ఉత్పత్తి చేస్తోంది. దాదాపు పది వేల వరకూ ఆస్పత్రి, ఐసీయూ బెడ్లను సరఫరా చేసింది. గత పద్నాలుగు నెలల్లో మహారాష్ట్రలోని ఖాలాపూర్లో కొత్త ఉత్పత్తి కేంద్రాన్ని ఆరంభించింది.
ఇక్కడ ఎంతలేదన్నా ప్రతిరోజు 300 పడకలను ఉత్పత్తి చేయగలరు. ఈ సందర్భంగా గోద్రెజ్ ఇంటీరియో అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ సమీర్ జోషీ మాట్లాడుతూ.. భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ ఫర్నీచర్ పరిశ్రమలో తమ వాటా ఎంతలేదన్నా 13 శాతం దాకా ఉంటుందన్నారు. గత సంవత్సరం ఏప్రిల్ 2020 నుండి, తాము 22% వృద్ధి చెందగా, 21 ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ వృద్ధి 15% గా నమోదు అయ్యిందన్నారు.
This website uses cookies.