Categories: NEW PRODUCTS

రూ.1100కే వాష్ బేసిన్

భోజనం చేసే ముందు కానీ ఆ తర్వాత కానీ శుభ్రంగా చేతులు కడుక్కోవడానికి.. మనలో చాలామంది ఇంట్లో ఏం బిగించుకుంటారు? వాష్ బేసిన్నే కదా!! ఫ్లాట్లు, విల్లాలు, వ్యక్తిగత ఇళ్లు.. ఇలా ఎక్కడైనా వాష్ బేసిన్ లేని ఇంటిని మనం చూడలేం. కొందరైతే హాల్ తో పాటు బాల్కనీలు, టాప్ ఫ్లోర్లు, బార్ కౌంటర్ల వద్ద కూడా వీటిని ఏర్పాటు చేసుకుంటారు. మరి, ప్రతి ఇంట్లో ఇంత కీలకమైన వాష్ బేసిన్లలోనూ విదేశీ రకాలూ మన హైదరాబాద్లో దొరుకుతున్నాయి. మరి, ఇందులో స్థానిక రకాలెన్నీ? వాటి ధరలెలా ఉన్నాయంటే..

హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా ఖ్యాతినార్జించడంతో సానిటరీ వేర్లో మన వద్ద దొరకని బ్రాండ్ అంటూ లేదు. లోకల్ బ్రాండ్ నుంచి ఇంపోర్టెడ్ రకాలూ స్థానికంగా లభిస్తున్నాయి. ఉదాహరణకు, జూబ్లీహిల్స్ రోడ్ నెం 40లో గల హోమ్ 360 డిగ్రీస్ స్టూడియోకి వెళితే చాలు.. లెక్కలేనన్నీ బ్రాండ్లు దర్శనమిస్తాయి. ప్యారీవేర్ రకం తీసుకుంటే.. వాష్ బేసిన్ ఆరంభ ధర కేవలం పదకొండు వందలు మాత్రమేనని గుర్తుంచుకోండి. సైజు, డిజైన్ ని బట్టి ఇందులో రూ.11,500 వరకూ వాష్ బేసిన్లు దొరుకుతాయి.

రోకా బ్రాండ్ వాష్ బేసిన్ కావాలని కోరుకునేవారు.. కనీసం రూ4,330 పెట్టాల్సి ఉంటుంది. గరిష్టంగా ఇందులో రూ.54,430కి దొరికే రకాలూ ఉన్నాయి. ఇంకాస్త మెరుగైన రకాన్ని కోరుకునేవారు.. కోహ్లర్ రకం ఎంచుకోవచ్చు. ఇందులో ప్రారంభ ధర రూ.7500 కాగా.. గరిష్ఠంగా రూ.67 వేల దాకా ఉంటుంది. ఇవన్నీ కాదు.. తమ ఇల్లు ఇతరుల కంటే భిన్నంగా ఉండాలని కోరుకునేవారి కోసం విదేశీ రకాల వాష్ బేసిన్లు మన నగరంలో లభిస్తున్నాయి. కాకపోతే, వీటికి కాస్త ఖరీదు ఎక్కువ అవుతుంది. ఆరంభ ధర రూ.25,000 ఉంటుంది. గరిష్టంగా రూ.85 వేల దాకా పెట్టాల్సి ఉంటుంది.

వివరాలకు- హోమ్ 360 డిగ్రీస్
జూబ్లీహిల్స్ రోడ్ నెం.40.
మొబైల్ +919948078659
మెయిల్: admin@home360degree.com

This website uses cookies.