ఎఫ్టీఎల్ తరువాత నీటి పరివాహక ప్రాంతాన్ని బఫర్ జోన్ గా పిలుస్తారు. రెండు లేదంటే అంతకంటే ఎక్కువ నీటి వనరులు ఉన్న ప్రాంతాల్ని వేరే చేసే ప్రదేశాన్ని బఫర్ జోన్ అంటారు. అక్కడ లభించే నీటి వనరు లభ్యత ఆధారంగా బఫర్ జోన్ పరిధిని డిసైడ్ చేస్తారు. ఇవి కూడా ఆయా ప్రదేశాలను బట్టి చెరువులకు అనుగుణంగా బఫర్ జోన్ పరిధిని నిర్ణయిస్తుంటారు.
చెరువుల నుంచి పల్లపు ప్రాంతాలకు నీరు పారటం సహజంగా చోటు చేసుకునేది. దీన్నే అలుగుగా వ్యవహరిస్తుంటారు. సింపుల్ గా చెప్పాలంటే చెరువులకు, పొలాలకు మధ్య ఉన్న ప్రాంతాన్ని బఫర్ జోన్ అంటారు. సాధారణంగా ఎఫ్టీఎల్ పరిధి నుంచి 30 మీటర్లు.. అంటే వంద అడుగుల వరకు ఎలాంటి నిర్మాణాల్ని నిర్మించకూడదు. అయితే సదరు చెరువు 25 హెక్టార్లు అంతకు మించి విస్తీర్ణంలో ఉంటే సుమారు 30 మీటర్ల మేరకు ఎలాంటి నిర్మాణం కట్టకూడదు. చెరువు 10 మీటర్ల వెడల్పుతో ప్రవహిస్తుంటే దానికి 9 మీటర్ల దూరం తర్వాతే భవనాల నిర్మాణానికి అనుమతినిస్తారు.
10 మీటర్ల కంటే వెడల్పుతో ప్రవహించే నీటి వనరులకు 30 మీటర్ల దూరం తర్వాతే భవన నిర్మాణాలకు అనుమతివ్వాలని పంచాయితీ, మున్సిపల్ చట్టాలు చెబుతున్నాయి. ఇక నీటి వనరులను బట్టి బఫర్ జోన్ ను నిర్ధారిస్తారు. బఫర్ జోన్ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేయవద్దు. శిఖం భూముల విషయానికి వస్తే ఇక్కడ 9 మీటర్ల తరవాతే నిర్మాణాలకు అనుమతిస్తారు. చిన్న చిన్న కాలువలు, వాగులు, నాలా, స్మార్ట్ వాటర్ డ్రెయిన్ విషయానికి వస్తే 10 మీటర్ల వెడల్పు ఉండే ప్రాంతాల్లో.. 2 రెండు మీటర్ల అవతల మాత్రమే నిర్మాణాలు చేపట్టాలి. బఫర్ జోన్ లో రోడ్లను 12 మీటర్ల వెడల్పు వరకే అనుమతించాలని నిబంధనలు చెబుతున్నాయి. బఫర్ జోన్ లో రిక్రియేషన్ డెవలెప్మెంట్ విషయానికి లేదా గ్రీన్ బెల్ట్ రింగ్ రోడ్డు లేదా 12 మీటర్ల వరకే అభివృద్ధికి అనుమతిస్తారు. అయితే బఫర్ జోన్ ప్రాంతాన్ని సెట్ బ్యాక్ అవసరాలకు ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదని నిబంధనలు చెబుతున్నాయి.
This website uses cookies.