poulomi avante poulomi avante

స్థిరాస్తి రిజిస్ట్రేషన్ లో తప్పులు దొర్లితే ఏం చేయాలి?

స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ సమయంలో ఒక్కోసారి తప్పులు దొర్లుతుంటాయి. ఇల్లు, ఫ్లాటు, ఖాళీ స్థలాల వంటివి కొనుగోలు చేసినప్పుడు కొన్నిసార్లు దస్తావేజుల్లో తప్పులు నమోదవ్వడం జరుగుతుంటుంది. రిజిస్ట్రేషన్‌ చేసుకున్న తర్వాత ఆ తప్పులను సవరించుకునే అవకాశాలున్నాయనే విషయం చాలామందికి తెలియదు. రెక్టిఫికేషన్‌ విధానంతో తప్పులను అధికారికంగా సవరించుకునే వెసులుబాటు రిజిస్ట్రేషన్‌ శాఖ కల్పిస్తోంది.

సాధారణంగా ఇల్లు, ఫ్లాటు, ఖాళీ స్థలాల వంటి స్థిరాస్తులు కొనుగోలు చేసినప్పుడు ఒక్కోసారి డాక్యుమెంట్స్ లో తప్పులు దొర్లుతుంటాయి. అంతే కాకుండా రిజిస్ట్రేషన్ సమయంలో అధికారులు నమోదు చేసే వివరాలు తప్పుగా రికార్డు అవుతుంటాయి. అయితే చాలా మందికి అలా తప్పుగా నమోదైన వివరాలను ఎలా సవరించుకోవాలన్నది తెలియదు. కానీ రిజిస్ట్రేషన్ శాఖలో అలాంటి తప్పులను సవరించుకునే రెక్టిఫికేషన్‌ విధానం అందుబాటులో ఉంది. ఉదాహరణకు మనం కొనుగోలు చేసిన ఆస్తికి సంబంధించిన హద్దులు, అమ్కకందారులు, కొనుగోలుదారుల పేర్లలో అచ్చు తప్పులు దొర్లడంతో పాటు ఇల్లు, ఫ్లాట్, స్థలం విస్తీర్ణాల్లో అంకెలు మారడం, ప్రాంతాల పేర్లు మారిపోవడం వంటివి జరుగుతుంటాయి. ఇవన్నీ చిన్నచిన్న తప్పులే అయినప్పటికీ కొన్నిసార్లు అవే పెద్ద సమస్యలకు కారణమవుతుంటాయి.

అలా తప్పులు దొర్లిన ఆస్తుల ద్వారా బ్యాంకుల్లో రుణాలు తీసుకునే సందర్భాలతో పాటు వాటిని తిరిగి విక్రయించాలనుకున్నపుడు ఇబ్బందులు వస్తుంటాయి. అంతేకాకుండా ఆస్తుల పంపకాల సమయంలోనూ న్యాయపరమైన చిక్కులు తలెత్తుతాయి. దీంతో చాలా సందర్బాల్లో ఏంచేయాలో చాలా మందికి తెలియదు. కానీ వీటన్నింటికీ రిజిస్ట్రేషన్ శాఖలో పరిష్కారం ఉంది. అదే రెక్టిఫికేషన్‌. దీని ద్వారా రిజిస్ట్రేషన్ సమయంలో దొర్లిన అన్ని తప్పులను సవరించుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. రెక్టిఫికేషన్‌ అంటే అంతకు ముందు జరిగిన సేల్‌డీడ్, గిఫ్ట్‌డీడ్, పార్టిషన్‌ డీడ్‌ రిజిస్ట్రేషన్‌ తాలూకు ఒప్పందాలను సవరణలు చేసి తిరిగి రాసుకోవడమన్నమాట.

రెక్టిఫికేషన్‌ కు సైతం సాధారణ రిజిస్ట్రేషన్‌ తరహాలోనే స్థిరాస్తి అమ్మకందారులు, కొనుగోలుదారులు ఇద్దరు హాజరు కావాల్సి ఉంటుంది. అంతకు ముందు జరిగిన ఇల్లు, ఫ్లాట్, ఖాళీ స్థలాల ఒరిజినల్‌ డాక్యుమెంట్స్ సాయంతో మళ్లీ కొత్తగా మరో సెట్టు డాక్యుమెంట్స్ ను తయారు చేయించుకోవాలి. రెక్టిఫికేషన్‌ కు కనీసం ఒకరోజు ముందు స్లాట్‌ బుక్ చేసుకోవడంతో పాటు ఆన్ లైన్ లో లేదంటే చలానా ద్వారా రూ.2,500 ఫీజు చెల్లించాలి. స్లాట్‌ సమయం ప్రకారం అమ్మకందారులు, కొనుగోలుదారులు సంబంధిత‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వస్తే రెక్టిఫికేషన్‌ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్‌ చేసి సీరియల్ నెంబర్ ఇస్తారు.

రెక్టిఫికేషన్‌ లో ఒకటి, రెండు తప్పులు కాకుండా అధిక సంఖ్యలో తప్పులను సవరించుకోవాలంటే మాత్రం రిజిస్ట్రేషన్‌ శాఖ నిర్ణయించిన పూర్తి స్థాయి ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కోసారి తొర్లిన తప్పులను బట్టి అంతకు ముందు రిజిస్ట్రేషన్ కొసం చెల్లించిన మొత్తాన్ని, రెక్టిఫికెషన్ కోసం మళ్లీ చెల్లించాల్సి రావచ్చు. రెక్టిఫికేషన్‌ విధానంలో సేల్, గిఫ్ట్, పార్టిషన్‌ వంటి అన్నిరకాల డాక్యుమెంట్స్ ను సవరించుకోవచ్చు. అయితే రెక్టిఫికేషన్ తరువాత రిజిస్ట్రేషన్ శాఖ ఇచ్చే సవరణ డాక్యుమెంట్ కు పాత డాక్యుమెంట్ ను జతచేసినప్పుడే వాటి చట్టబద్ధత చెల్లుబాటు అవుతుందని అధికారులు చెబుతున్నారు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles