హైదరాబాద్‌లోని పచ్చదనం, చెరువులు, కళలతో పాటు మరిన్ని కీలకమైన అంశాల్ని వివరిస్తూ హెచ్ఎండీఏ రూపొందించిన కాపీ టేబుల్ పుస్తకాన్ని మంత్రి కేటీఆర్ బుధవారం ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో సీఎం కేసీఆర్ కొన్ని ముఖ్యమైన విషయాల గురించి రాశారు. తెలంగాణ మున్సిపాలిటీల్లో పది శాతం సొమ్మును గ్రీన్ బడ్జెట్ గా కేటాయింపులు జరిపేలా మున్సిపల్ చట్టంలో పొందుపరిచామని దీంతో ప్రతి స్థానిక సంస్థల్లో ప్రకృతివనం ఏర్పాటు చేసేందుకు వీలు లభించిందని సీఎం పేర్కొన్నారు. పచ్చదనం, చెరువుల పరిరక్షణ అనేద పట్టణీకరలో భాగమని.. ఈ క్రతువులో హెచ్ఎండీఏ ముఖ్యభూమిక పోషించాల్సిన అవసరం ఉందని సీఎం తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ పచ్చదనాన్ని ఈ పుస్తకంలో ఆవిష్కరించారని మంత్రి కేటీఆర్ తెలిపారు. నగరం చుట్టూ పచ్చదనాన్ని పెంచేందుకు 16 అర్బన్ ఫారెస్ట్ బ్లాకులను హెచ్ఎండీఏ దత్తత తీసుకోవడం హర్షణీయమన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ డ్రిప్ ఇర్రిగేషన్ విధానాన్ని అవలంభించామని, ఫలితంగా 19 ఓఆర్ఆర్ కూడళ్ల వద్ద పచ్చదనం విరివిగా పెరిగిందని పురపాలక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ తెలిపారు.
This website uses cookies.