కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు కానీ ఏదైనా ఇంట్లోకి అద్దెకు వెళ్లినప్పుడు కానీ ఇంటి పెద్ద ఎక్కడ పడుకోవాలనే విషయంలో కొంత సందేహం ఏర్పడుతుంది. అయితే, ఇంట్లోని గదుల విషయంలో ఏ దిశ అయినప్పటికీ, ఇంటి యజమాని లేదా వయసు పైబడిన వాళ్లకు కానీ ప్లాటు మొత్తానికి నైరుతి భాగంలో పడక గది ఏర్పాటు చేసుకోవాలి. రెండో పడక గది వాయువ్యంలో ఏర్పరుచుకోవాలి. పిల్లల కోసం వాయువ్యం దిక్కున ప్రత్యేకమైన గది ఉంటే బాగుంటుంది.
వంట గదిని ప్లాటుకు తూర్పు భాగంలోని ఆగ్నేయం దిశలో ఏర్పాటు చేసుకోవాలి. తూర్పువైపు ప్రహరీ గోడకు కొంత ఖాళీ స్థలం వాదులుకుని కట్టుకోవాలి. ఈశాన్యం వైపున డ్రాయింగ్ రూము లేదా గెస్ట్ బెడ్ రూము ఏర్పాటు చేసుకోవాలి.
ఇక హాలు ఏర్పరుచుకునే విషయానికొస్తే.. ఇంట్లోని తూర్పు వైపు గదులకు, పడమటి వైపుగదులకు మధ్యలో / ఉత్తరం వైపు గదులకు, దక్షణం వైపు గదులకు మధ్యలో చతురస్రం కానీ లేదా దీర్ఘచతురస్ర ఆకారంలో కానీ ఏర్పరుచుకోవాలి. ముఖ్యంగా ఏ దిక్కులోనైనా, ఏ రకంగానైనా పెరగటం కానీ తరగటం కానీ జరగకూడదు.