చిన్న అపార్టుమెంట్ అయినా లగ్జరీ విల్లా అయినా కిటికీలకు యూపీవీసీ కిటికీలు ఉండాల్సిందే. తాజాగా, వ్యక్తిగత ఇళ్లను కట్టుకునే వారూ ఈ తరహా కిటికీల వైపు మొగ్గు చూపుతున్నారు. దీర్ఘకాలిక మన్నికను పరిగణనలోకి తీసుకుని.. ఖర్చు ఎక్కువైనా ఫర్వాలేదని అంటున్నారు. కాకపోతే, కొవిడ్ మహమ్మారి వల్ల గత అక్టోబరు నుంచి యూపీవీసీ కిటికీల ధరలు గణనీయంగా పెరిగాయి.
యూపీవీసీ కిటికీ వల్ల అనేక ఉపయోగాలున్నాయి. ఇంట్లోకి గాలి కూడా దూరడానికి వీల్లేని విధంగా వీటిని బిగించుకోవచ్చు. శబ్ద కాలుష్యాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ముప్పై శాతం వరకూ ఏసీ బిల్లు కూడా తగ్గుతుంది. అగ్ని వ్యాప్తిని గట్టిగా నిరోధిస్తుంది. గాలి తట్టుకుని సమర్థంగా నిలబడుతుంది. నిర్వహణలో పెద్దగా ఇబ్బంది ఉండదు. దీర్ఘకాలం మన్నికగా నిలవడంతో పాటు పర్యావరణానికి అనుకూలమైన వస్తువుగా ముద్రపడింది. ఇంటి యజమానులు కోరుకున్న సైజల్లో, ఆకారాల్లో ఇవి లభిస్తాయి. అందుకే, వీటి పట్ల అధిక శాతం మంది ఇంటి యజమానులు, డెవలపర్లు ఆసక్తి చూపిస్తున్నారు.
నిన్నటివరకూ మనకు యూపీవీసీ కిటికీలు చైనా, కొరియా వంటి దేశాల నుంచి యూపీవీసీ ప్రొఫైళ్లు
ఎక్కువగా దిగుమతి అయ్యేవి. కరోనా దెబ్బ.. దిగుమతుల మీద ఆంక్షలు పెరగడం వంటి కారణాల వల్ల విదేశాల్నుంచి ప్రొఫైళ్లు దిగుమతి కావడం చాలా తగ్గిపోయాయి. ఇవి ఒకప్పుడు వంద శాతముంటే, ప్రస్తుతం పది శాతం కూడా మించడం లేదు. పైగా, మేకిన్ ఇండియాలో భాగంగా మన వద్ద యూపీవీసీ కిటికీల తయారీదారులు గణనీయంగా పెరిగిపోయారు. ఒక్క హైదరాబాద్లోనే ఎంతలేదన్నా 125 మంది దాకా వ్యాపారులు దాకా పెరిగారు. కాకపోతే, గతేడాది కరోనా దెబ్బ వల్ల ఇందులో ముప్పయ్ నుంచి నలభై మంది తమ వ్యాపారాన్ని మూసివేసి ఇతర రంగాల్లోకి మారిపోయారు. మరికొందరేమో పెద్ద సంస్థల్లోకి చేరారు.
నిన్నటివరకూ చైనా నుంచి విపరీతంగా దిగుమతి అయ్యేవి. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు. చైనా రకం రేటు చదరపు అడుక్కీ రూ.320 నుంచి రూ.360 దాకా ఉండేది. జర్మనీ రకమేమో రూ.500కు లభించేవి. అంటే 4/4 చదరపు అడుగుల సైజున్న కిటికీ కోసం ఎంతలేదన్నా రూ.5000 నుంచి రూ.8000 అయ్యేది. కిటికీ సైజు, డిజైన్, సంస్థను బట్టి రేటు మారేది. ఇంతకంటే తక్కువ రకాలు మార్కెట్లో ఉన్నాయి. కాకపోతే, ఇప్పుడు దిగుమతి లేకపోవడం.. యూపీవీసీ కిటికీల్లో వాడే పీవీసీ ధర రెండింతలు కావడం, అద్దం, హార్డ్ వేర్ వంటి ముడిసరుకుల రేట్లు గత అక్టోబరు నుంచి విపరీతంగా పెరిగాయి. అందుకే, నిన్నటివరకూ రూ.330-340కి దొరికే ఒక్క కిటికీ ప్రస్తుతం చదరపు అడుక్కీ కనీసం రూ.400 పెట్టనిదే దొరకడం లేదు. నాణ్యమైన జర్మనీ రకాల కోసం కాస్త ఎక్కువే పెట్టాల్సి ఉంటుంది.
ఇంటికి ఖర్చెంత?
యూపీవీసీ కిటికీలు ఇంటి అందాన్ని రెట్టింపు చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే, వీటి వైపు అధిక శాతం మంది ఎంపిక చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. అంతెందుకు ఇవి లేకుండా బహుళ అంతస్తుల అపార్టుమెంట్లను ఊహించగలమా? ఎందుకంటే, నిర్మాణం ఎత్తు పెరిగే సరికి విపరీతమైన గాలిని తట్టుకోవాల్సి ఉంటుంది. అందుకే, అధిక శాతం మంది డెవలపర్లు వీటిని ఎంచుకుంటున్నారు. మన రాష్ట్రంలో అపర్ణా, ఫెనెస్టా, ఎల్ జీ, రెహావు, టీఎన్ఆర్ వ్యూస్, పెన్నార్ వంటి సంస్థలు వీటిని విక్రయిస్తున్నాయి.
– విక్రమ్ కుమార్, ఎండీ, టీఎన్ఆర్ వ్యూస్
గత పదేళ్లలో ఎన్నడూ లేనిది.. 2020 అక్టోబరు నుంచి యూపీవీసీ కిటికీ రేటు గణనీయంగా పెరిగింది. వీటి తయారీలో వాడే పీవీసీ, అద్దం, హార్డ్ వేర్, లేబర్ వంటి రేట్లు పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని చెప్పొచ్చు. చైనా నుంచి దిగుమతులు గణనీయంగా తగ్గిపోయాయి. కొంతకాలం నుంచి మన దగ్గర ప్రతిఏటా ఎనిమిది శాతం చొప్పున సాధారణ కలప బదులు యూపీవీసీ కిటికీలను వాడేవారు పెరుగుతున్నారు. హైదరాబాద్లో దాదాపు పాతిక శాతం కంటే ఎక్కువ మంది వీటిని తమ ఇళ్లకు బిగిస్తున్నారు. వీటిని ఎంచుకునే ముందు, రేటు కంటే నాణ్యతను ఎక్కువగా గమనించాలనే విషయం ఎవరూ మర్చిపోవద్దు.
డిజైనర్ టైల్ ఒకరి ఇంటిని అలంకరించడానికి ఉపయోగించవచ్చు. గోడ లేదా ఫ్లోరింగ్ ఎలిమెంట్‌గా కూడా ఆచరణాత్మకంగా తీర్చిదిద్దవచ్చు. ఎందుకంటే ఇంటీ డిజైన్‌ను డిజైనర్ టైల్ ద్వారా కొత్త పోకడల్ని రూపొందించవచ్చు. మొక్కలలోని రంగులను పూర్తి చేయడానికి తోటలో డిజైనర్ టైల్ కూడా ఉపయోగించవచ్చు. లేటెస్ట్ ప్రింటింగ్ టెక్నాలజీని వినియోగించుకుని మనకు నచ్చిన చిత్రాల్ని టైళ్ల మీద ప్రింట్ చేయవచ్చు. వాటిని గోడలకు వేలాడదీయవచ్చు. వాల్ పేపర్ గా కూడా వాడుకోవచ్చు.
This website uses cookies.