Categories: LATEST UPDATES

రియాల్టీ క్రౌడ్ ఫండింగ్ ఎవ‌రికి ఉప‌యోగం?

రియల్ ఎస్టేట్ క్రౌడ్ ఫండింగ్ అనేది భారతీయ పెట్టుబడిదారులకు ఓ సరికొత్త పెట్టుబడి మార్గంగా అవతరించింది. సాంకేతికత, సమిష్టి భాగస్వామ్యం, బలమైన భారతీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ ను కలపడం ద్వారా క్రౌడ్ ఫండింగ్ పెట్టుబడిదారులకు వారి పోర్టిఫోలియోలను వైవిధ్యపరచడానికి, అభివృద్ధి చెందుతున్న అవకాశాలను ఉపయోగించుకోవడానికి మంచి అవకాశం అందిస్తోంది. వాస్తవానికి భారతీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ బలంగా ఉండటంతోపాటు ఎల్లప్పుడూ గణనీయంగా రాబడి అందించడం వంటి అంశాల కారణంగా ఇది ఆకర్షణీయమైన పెట్టుబడి మార్గంగా మారింది. అయితే, సంప్రదాయ రియల్ ఎస్టేట్ పెట్టుబడులు అధిక ముందస్తు మూలధన అవసరాలు, ఆస్తి నిర్వహణ సంక్లిష్టతలు, మార్కెట్ చక్రాల వంటి సవాళ్లు ఎదుర్కొంటాయి. రియల్ ఎస్టేట్ క్రౌడ్ ఫండింగ్ వీటిని పరిష్కరిస్తుంది. ఇందులోని కీలక అంశాలివీ..

  • రియల్ ఎస్టేట్ క్రౌడ్ ఫండింగ్ లో పెట్టుబడిదారులు తక్కువ మొత్తం మూలధనంతో ప్రవేశించే వీలుంటుంది. ఈ యాక్సెసబిలిటీ పెట్టుబడిదారులను వివిధ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో వారి పోర్టిఫోలియోలను వైవిధ్యం చేయడానికి వీలు కల్పిస్తుంది. అలాగే రిస్కు శాతం తగ్గించడంతోపాటు రాబడిని పెంచుతుంది.
  • క్రౌడ్ ఫండింగ్ అనేది అధిక ప్రారంభ పెట్టుబడుల భారాన్ని తగ్గిస్తుంది. దీంతో ఎక్కువమంది పెట్టుబడిదారులు గణనీయమైన మూలధనం లేకుండానే మార్కెట్లోకి ప్రవేశించవచ్చు. యువ నిపుణులు, పరిమిత ఆదాయం కలిగి ఉన్నవారికి మంచి అవకాశంగా ఉంటుంది.
  • విశ్వసనీయమైన క్రౌడ్ ఫండింగ్ ఫ్లాట్ ఫారమ్ లు లిస్టెడ్ ప్రాజెక్టుల గురించి సవివరమైన సమాచారం అందిస్తాయి. ఇన్వెస్టర్లు తగిన నిర్ణయం తీసుకునే అవకాశం కల్పిస్తాయి. అంతేకాకుండా పెట్టుబడిదారుల తరఫున పూర్తి శ్రద్ధ కనబరుస్తాయి.
  • క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ ఫారమ్ ల ద్వారా వివిధ నగరాలు, ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టే వెసులబాటు పెట్టుబడిదారులకు వస్తుంది. ఇది గతంలో అందుబాటులో లేని మంచి మార్కెట్లోకి ప్రవేశించడానికి అనుమతి ఇస్తుంది.
  • రియల్ ఎస్టేట్ క్రౌడ్ ఫండింగ్ ఆకర్షణీయమైన రాబడి సంభావ్యత కలిగి ఉంటుంది. ప్రాజెక్టు, మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి రాబడి మారుతుంది. అందువల్ల పటిష్టమైన వృద్ధి సామర్థ్యం ఉన్న ప్రాజెక్టుల వ్యూహాత్మక ఎంపిక పెట్టుబడిపై గణనీయమైన రాబడి అవకాశం కల్పిస్తుంది.
  • రియల్ ఎస్టేట్ క్రౌడ్ ఫండింగ్ వల్ల ప్రయోజనాలు ఉన్నప్పటికీ, భారతీయ పెట్టుబడిదారులు ఇందులో ఉన్న సవాళ్ల గురించి కూడా తెలుసుకోవాలి. మనదేశంలో ఈ క్రౌడ్ ఫండింగ్ కోసం రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్ ఇంకా అభివృద్ధి దశలో ఉంది. అలాగే పెట్టుబడిదారులు తమ ప్రయోజనాలు కాపాడుకునేందుకు అన్ని అంశాలనూ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. అలాగే ఇందులో నుంచి బయటకు రావడానికి ఎలాంటి మార్గాలు ఉన్నాయో కూడా ముందుగానే తెలుసుకోవాలి.

This website uses cookies.