స్ట్రాటజిక్ లొకేషన్‌లో ఆకర్షణీయమైన స్పెసికేషన్స్‌తో ఆరంభించే ప్రాజెక్టులను కొనుగోలుదారులు అక్కున చేర్చుకుంటారు. ఈ విషయం వాసవి సరోవర్ ప్రాజెక్టు ద్వారా నిరూపితమైంది. అటు కోర్ సిటీ ఇటు హైటెక్ సిటీకి మధ్యలోని కూకట్‌పల్లిలో సుమారు 21 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును వాసవి సంస్థ డెవలప్ చేస్తోంది. రెరా అనుమతి పొందిన ఈ ప్రాజెక్టులో పదకొండు టవర్లను కడతారు. ఒక్కో టవర్ ఎత్తు 29 అంతస్తులు కాగా మొత్తం వచ్చే ఫ్లాట్ల సంఖ్య సుమారు రెండు వేల ఐదు వందల ముప్పయ్ ఫ్లాట్లను డెవలప్ చేస్తారు. ఫ్లాట్ల సైజు విషయానికి వస్తే 1280 చదరపు అడుగుల్లో టూ బెడ్రూమ్ ఆరంభమవుతాయి. గరిష్ఠంగా 2,895 చదరపు అడుగుల్లో ఫ్లాట్లు లభిస్తాయి.
* నగరంలోనే ప్రప్రథమంగా వాసవి సరోవర్‌లో మూడు క్లబ్ హౌజుల్ని అభివృద్ధి చేయాలనే నిర్ణయాన్ని తీసుకున్నారు. దీన్ని దాదాపు 96 వేల 660 చదరపు అడుగుల విస్తీర్ణంలో డెవలప్ చేస్తారు. చిన్నారుల నుంచి పెద్దల వరకూ కావాల్సిన సమస్త సదుపాయాల్ని ఇందులో పొందుపరిచారు. ఇందులో 85 స్కై విల్లాలు.. 74 అపార్ట్ విల్లాల్ని డిజైన్ చేశారు. వాసవి సరోవర్ ప్రాజెక్టు నుంచి మూసాపేట్ మెట్రో కానీ కూకట్‌పల్లి మెట్రో కానీ చేరువలో ఉంటుంది. మాదాపూర్‌లో పని చేసే ఐటీ నిపుణులు సులువుగా రాకపోకల్ని సాగించొచ్చు. షాపింగ్ మాళ్లు, మల్టీప్లెక్స్ థియేటర్లు చేరువగా ఉంటాయి. సమీపంలోనే స్కూళ్లు, కాలేజీలున్నాయి. ఇందులో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనలున్నవారే ఎక్కువగా కొనుగోలు చేశారు. ఇంకా, అనేకమంది వాసవి సరోవర్‌లోనే తీసుకోవాలని ప్రణాళికల్ని రచిస్తున్నారు.
* వాసవి సరోవర్ ప్రాజెక్టుకు చేరువలో గల మూడు చెరువుల్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ కింద కళాత్మకంగా తీర్చిదిద్దాలని నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో చెరువును సుమారు పది కోట్లు వెచ్చించి డెవలప్ చేస్తున్నారు. భవిష్యత్తులో అభివృద్ధి చేసే చెరువులకు మార్గదర్శకంగా ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. ఈ ప్రాజెక్టును 2026 చివరికల్లా పూర్తి చేసి కొనుగోలుదారులకు అందజేయడానికి సంస్థ సన్నాహాలు చేస్తోంది. ఇందులో ఫ్లాట్ కొనుగోలు చేసినవారికి స్పిన్ అండ్ విన్ ద్వారా పలు బంపర్ బహుమతుల్ని అందజేస్తురు. కొంతమంది కస్టమర్లకు కార్ పార్కింగ్ ఉచితంగా ఇస్తున్నారు. భార్యాభర్తల్ని బాలీ ట్రిప్‌కు పంపిస్తాం. నెక్సాన్ ఈవీ కారును కూడా బహుమతిగా ఇస్తారు. అటు కోర్ సిటీ.. ఇటు హైటెక్ సిటీకి చేరువగా ఉండాలని భావించేవారు.. వాసవి సరోవర్‌ను విజిట్ చేయడం మర్చిపోకండి.
This website uses cookies.