రియ‌ల్ రంగం ప‌డిపోతుందా?

  • డెవలపర్ల అంచనాలివే

గతేడాది దేశంలో హౌసింగ్ డిమాండ్ కొత్త పుంతలు తొక్కగా.. ఈ ఏడాది అది మరింత ఉన్నత స్థాయికి వెళ్లే అవకాశం ఉందని డెవలపర్లు అంచనా వేస్తున్నారు. జనవరి నుంచి ఇళ్ల విక్రయాలు ఊపందుకోవడంతో రియల్ ఎస్టేట్ నిపుణులు, డెవలపర్లు ఈ ఏడాది అవి మరింత వృద్ధి చెందుతాయని ధీమాగా ఉన్నారు. ఇన్ పుట్ ఖర్యులు, గృహ రుణాల వడ్డీ రేట్లు పెరగడం వంటి అనేక సవాళ్లు ఉన్నప్పటికీ.. హౌసింగ్ డిమాండ్ బలంగా, నిరంతరాయంగా కొనసాగుతోందని సిగ్నేచర్ గ్లోబల్ వ్యవస్థాపకుడు, చైర్మన్ ప్రదీప్ అగర్వాల్ పేర్కొన్నారు.

ఇది గృహ కొనుగోలుదారుల మెరుగైన స్తోమతను హైలైట్ చేస్తోంది. అంతేకాకుండా స్వల్పకాలిక హెచ్చుతగ్గుల కంటే దీర్ఘకాలిక అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారని తెలుస్తోంది’ అని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో గృహ నిర్మాణ రంగం పరివర్తన చెందిందని, ఇది మరింత పరిణితి చెందడమే కాకుండా ప్రాథమికంగా బలంగా మారిందని క్రిసుమి కార్పొరేషన్ ఎండీ మోహిత్ జైన్ అభిప్రాయపడ్డారు. తుది వినియోగదారుల నుంచి బలమైన డిమాండ్ ఉందని, అలాగే పెట్టుబడిదారులు కూడా మార్కెట్ కు తిరిగి వస్తున్నారని పేర్కొన్నారు. బలమైన పునాది, స్థిరమైన వృద్ధితో స్తిరాస్థి రం అంతరాయాలు లేకుండా ఇలాగే దూసుకెళ్తుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. 2022లో ఇళ్ల అమ్మకాలు రెండంకెల మేర పెరగ్గా.. ఇటీవల ముగిసిన జనవరి-మార్చి త్రైమాసికంలో అవి మరింత పెరిగాయి. జనవరి-మార్చి త్రైమాసికంలో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 1,13,770 యూనిట్ల ఇళ్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 14 శాతం అధికం. అలాగే గత మూడు నెలల్లో 1,09,570 యూనిట్ల కొత్త లాంచ్ లు జరిగాయి. ఇది 23 శాతం అధికం. 2022లో ఇదే కాలంలో 89,140 యూనిట్ల లాంచ్ లు మాత్రమే జరిగాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ ఏడాది ఇళ్ల డిమాండ్ సరికొత్త స్థాయికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.

This website uses cookies.