ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరబిందో రియాల్టీ (ప్రస్తుతం ఆరో రియాల్టీ) ఎండీ శరత్‌చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారిన విషయం తెలిసిందే. దీంతో, ఈ సంస్థ మాదాపూర్, కొండాపూర్‌లో చేపడుతున్న ప్రాజెక్టులపై ప్రతికూల ప్రభావం పడుతుందా అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే, బీఆర్ఎస్ హయంలోనే అరబిందో రియాల్టీ.. మాదాపూర్, రాయదుర్గం వంటి ప్రాంతాల్లో ప్రైమ్ ప్రాపర్టీలను సొంతం చేసుకుంది. పటాన్‌చెరులోనూ విల్లాల్ని ఆరంభించింది. హైదరాబాద్‌లో అనేకమంది డెవలపర్లు ఉండగా.. అరబిందో రియాల్టీకే ఆ ప్రైమ్ ప్రాపర్టీలను ఎలా సొంతం చేసుకోగల్గింది? అప్పటి బీఆర్ఎస్ పెద్దల సహకారం కచ్చితంగా ఉందని నిర్మాణ నిపుణులు సైతం అంగీకరిస్తున్నారు. మరి, ఇప్పుడేమో ఆయన అప్రూవర్‌గా మారి.. కల్వకుంట్ల కవితకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబితే.. రెండు ప్రాజెక్టులకు సంబంధించిన భూముల వ్యవహారం బయటికొచ్చే అవకాశం లేకపోలేదు. దీని వల్ల అంతిమంగా ఏం జరుగుతుందంటే.. మాదాపూర్‌లోని కొహినూర్ ప్రాజెక్టులో ఫ్లాట్లను కొన్న బయ్యర్లు కొంత గందరగోళానికి గురయ్యే అవకాశముంది. కాకపోతే, అరబిందో రియాల్టీ తెలివిగా ఏం చేస్తుందంటే.. కొన్ని ప్రధాన ప్రకటనల వర్షం కురిపించి.. తమ మీద ప్రతికూల ప్రభావం పడలేదని నిరూపించే ప్రయత్నం చేస్తుంది. అందుకే, బయ్యర్లు ఎప్పుడైనా రాజకీయాలతో సంబంధమున్న బిల్డర్ల వద్ద స్థిరాస్తిని కొనకపోవడమే మంచిదని నిపుణులు అంటున్నారు.
This website uses cookies.