ఫ్యూచరిస్టిక్ లొకేషన్లో.. మంచి పేరు ప్రఖ్యాతలున్న డెవలపర్.. కొత్త ప్రాజెక్టును ప్రారంభిస్తే.. కొనుగోలుదారులు ఎగబడి ఫ్లాట్లను కొంటారని తాజాగా నిరూపితమైంది. ఆషియానా హౌసింగ్ అనే సంస్థ ఇటీవల గురుగ్రామ్‌లోని సెక్టార్ 93లో ఒక ప్రాజెక్టును ఆరంభించింది.
అలా సంస్థ ప్రకటన చేసిన పదిహేను నిమిషాలకే సుమారు 224 ఫ్లాట్లు అమ్ముడయ్యాయి. ఔను.. కేవల పదిహేను నిమిషాలకే అన్నీ బుక్ అయ్యాయి. వీటి మొత్తం విలువ సుమారు రూ.440 కోట్ల దాకా ఉంటుందని ఆషియానా హౌసింగ్ అధికారికంగా వెల్లడించింది.
This website uses cookies.