Categories: LATEST UPDATES

ఈ వాస్తుతో మీ ఇళ్లు సూపర్

ఇంటి నిర్మాణంలో వాస్తుది ఎనలేని పాత్ర. ప్లాట్ కొనుగోలు దగ్గర నుంచి ఇంటి నిర్మాణం పూర్తయ్యే వరకు చాలామంది వాస్తును పాటిస్తారు. కొంతమందికి వాస్తు గురించి ఏమీ తెలియకపోయినా.. వాస్తు నిపుణుడిని సంప్రదించి అందుకు అనుగుణంగా తమ ఇంటిని నిర్మించుకుంటారు. ఈ నేపథ్యంలో అందరికీ అవగాహన కోసం కొన్ని ప్రాథమిక వాస్తు నియమాలు తెలియజేస్తున్నాం..

ఇవీ వాస్తు సూత్రాలు..

– చతురస్రం, దీర్ఘచతురస్ర ఆకారంలో ఉన్న ప్లాట్ నే కొనుగోలు చేయాలి. మూలలు ఎక్కువగా లేదా తక్కువగా ఉండకూడదు. అలాగే ఏటవాలు ఉన్నా దానిని వదిలేయడమే బెటర్.- పూజగది ఇంటికి ఈశాన్యంలోనే ఉండాలి. దీపం ఆగ్నేయం వైపు, నీళ్లు ఈశాన్యం వైపు ఉంచాలి.
– పూజగదిలో నుంచి విరిగిపోయిన విగ్రహాలు, వెలిసిపోయిన ఫొటోలను తీసేయాలి.
– చనిపోయిన లేదా పూర్వీకుల ఫొటోలు నైరుతి వైపు ఉంచాలి. వీటిని పూజగది, బెడ్ రూమ్ లో ఉంచకూడదు.

– లివింగ్ రూమ్, డైనింగ్ రూమ్ ఉత్తరం, తూర్పు లేదా ఈశాన్యం వైపు ఉండేలా చూసుకోవాలి.
– మాస్టర్ బెడ్ రూమ్ నైరుతి వైపు ఉండాలి. ఇందులో ఇంటి పెద్ద పడుకోవాలి.
– బాత్ రూమ్ కచ్చితంగా వాయువ్యం లేదా పడమర ప్రాంతం వైపు ఉండాలి.
– ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు రూఫ్ పైన నైరుతి వైపు ఉండాలి. సంప్ ఈశాన్యంలో ఉంటే మంచిది.
– ఇంట్లో పెట్టుకునే విగ్రహాలు, ఫొటోలు చాలా కీలకం. యుద్ధాలను ప్రతిబింబించే చిత్రాలు, విచారవదనంతో కూడిన పెయింటింగులు, దు:ఖం, కష్టాలు, హింస, విపత్తులకు సంబంధించిన పెయింటింగులు ఇంట్లో ఉండకూడదు. స్టోర్ రూమ్ వాయువ్యంలో ఉంటే నిత్యావసరాలకు ఎలాంటి లోటూ ఉండదు.
– ఇంటి కేంద్ర స్తానాన్ని బ్రహ్మస్థానం అంటారు. అక్కడ ఎలాంటి బరువులూ ఉండకూదు. గోడలు, మెట్లు, స్తంభాలు ఉండకూడదు.
– స్టడీ రూమ్ ఇంటికి తూర్పు లేదా ఈశాన్యం వైపు ఉండాలి. విద్యార్థి తూర్పు వైపు లేదా ఉత్తరం వైపు ముఖం పెట్టి చదువుకోవాలి. స్టడీ రూమ్ కి పసుపు, నీలం, ఆరెంజ్, వయలెట్ వంటి వైబ్రెంట్ రుంగులు వేసుకోవాలి. స్టడీ రూమ్ దక్షిణం వైపు లేదా నైరుతి వైపు ఉంటే విద్యార్థికి ఏకాగ్రత లోపిస్తుంది.
– సైట్ నుంచి ఎక్కువ స్థాయిలో లబ్ధి పొందాలంటే ఇంటి వెడల్పు, ఎత్తు 1:2 నిష్పత్తిని మించకూడదు.
– మీ ఇంటి పైన అదనపు అంతస్తు లేదా గది నిర్మించాలనుకుంటే అది నైరుతి లేదా పడమర వైపు కనిపించేలా ఉండాలి. ఇది కష్ట సమయాల్లో షాక్ అబ్జార్బర్ లా పనిచూస్తే.. ఆదాయపరంగా లోటు లేకుండా చూసుకుంటుంది. పరిస్థితులు కఠినంగా ఉన్నప్పుడు నైతిక మద్దతు అందిస్తుంది. అలాగే నైరుతి వైపు అధిక ఎత్తు, అధిక బరువు చక్కని ఆరోగ్యాన్ని, సౌభాగ్యాన్ని అందిస్తుంది.

This website uses cookies.