Categories: Rera

13 మంది బిల్డర్లకు రూ.1.77 కోట్ల జరిమానా

తన ఆదేశాలను అమలు చేయనందుకు 13 మంది బిల్డర్లపై రెరా కొరడా ఝళిపించింది. కొనుగోలుదారులకు ఫ్లాట్ల అప్పగింతలో జాప్యం, రిఫండ్స్, గ్రూప్ హౌసింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన పత్రాల సమర్పించకపోవడం వంటి అంశాల్లో వారికి ఉత్తరప్రదేశ్ రెరా నోటీసులు జారీ చేసింది. అయినప్పటికీ వారి నుంచి స్పందన లేకపోవడంతో 13 మంది బిల్డర్లకు రూ.1.77 కోట్ల జరిమానా విధించింది. ఇటీవల కాలంలో తానిచ్చిన ఆదేశాల అమలు ఎంత వరకు వచ్చిందనే విషయంపై తాజాగా రెరా సమీక్షించింది.

కొంతమంది బిల్డర్లకు తగినంత సమయం ఇచ్చినప్పటికీ తన ఆదేశాలను అమలు చేయలేదని గుర్తించి, చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. గార్డెనియా ఇండియాకు రూ.62.13 లక్షలు, ఎలగెంట్ ఇన్ ఫ్రాకన్ కు రూ.7.93 లక్షలు, రుద్రా బిల్డ్ వెల్ కు రూ.3.12 లక్షలు, యూనిబెరా డెవలపర్స్ కు రూ.6.31 లక్షలు, కేవీ డెవలపర్స్ కు రూ.6.67 లక్షలు, త్రీసీ గ్రీన్ డెవలపర్స్ కు రూ.42.40 లక్షలు, సన్ సిటీ హైటెక్ ఇన్ ఫ్రాస్టక్చర్స్ కు రూ.47,515, అంతరిక్ష్ ఇంజనీర్స్ కు రూ.6.98 లక్షలు, అనిల్ గుప్తాకు రూ.9.02 లక్షలు, ఐడియా బిల్డర్స్ కు రూ.6.8 లక్షలు జరిమానాగా విధించింది.

This website uses cookies.