నగరానికి చెందిన వాసవి గ్రూప్.. హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో పలు ప్రాజెక్టుల్ని అభివృద్ధి చేస్తోంది. దాదాపు 121.83 ఎకరాల్లో మొత్తం పదకొండు ప్రాజెక్టుల్లో.. 10,828 ఫ్లాట్లను నిర్మిస్తున్నారు. సుమారు 13.65 ఎకరాల్లో మూడు వాణిజ్య సముదాయాల్ని కడుతోంది. ఇది కాకుండా శామీర్పేట్లో 64 ఎకరాల్లో 866 గేటెడ్ కమ్యూనిటీ ప్లాట్లను డెవలప్ చేస్తోంది. తూముకుంట, సదాశివపేట్లో మరో 250 ఎకరాల్లో ప్లాట్లను అభివృద్ధి చేస్తోంది.
This website uses cookies.