- బిగ్ బాస్ కంటెస్టెంట్ రతికా రోజ్
బిగ్ బాస్ కంటెంటెస్ట్ రతికా రోజ్ కు ఆరేళ్ల వయసు ఉన్నప్పటి నుంచి వికారాబాద్ లోని ఓ అద్దె ఇంట్లో రెండో అంతస్తులో నివసించేది. ‘మా ఇంటి దగ్గరగానే ఓ గుడి ఉండేది. రోజూ హరతి ఇచ్చినప్పుడు కొట్టే గంట నాకు వినిపించేది. అదే నా అలారం. అప్పుడే నాకు సంగీతంపై కూడా ఆసక్తి పెరిగింది. దీంతో నేను సీడీలో సేకరించడం మొదలుపెట్టాను. వాటన్నింటినీ మనసు పెట్టి నేర్చుకుంటున్నాను’ అని వివరించారు.
దక్షిణాదిన పెద్ద స్టార్ కావాలని అనుకుంటున్న ఈ నటీమణి.. తన కలల నివాసాన్ని నిర్మించుకోవాలనుకుంటున్నారు. ఇందుకోసం నిర్మాణశైలులను అన్వేషిస్తున్నారు. ‘నేను హైదరాబాద్ లో రాజమహల్ నిర్మించడం కోసం స్థలం చూస్తున్నాను. ఇదేమీ తమాషా కాదు. నా ఇల్లు రాజమహల్ లాగానే ఉండాలి. అందుకే చారిత్రక వస్తువులు, పెయింటింగ్స్ కొనుగోలు చేయాలనుకుంటున్నాను. నేను మా రాజ, మెజిస్టిక్ వారసత్వం నుంచి చాలా ప్రేరణ పొందాను. చిలుకూరు బాలాజీ నా జీవితంలో ఓ శ్రేయోభిలాషి. అందువల్లో నా ఇంట్లో ఆయన విగ్రహాన్ని కూడా పెట్టుకుంటాను. రాజు లేని రాజభవనాన్ని బ్రహ్మాండంగా నిర్మించుకుంటాను’ అని రతికా రోజ్ పేర్కొన్నారు.
ఆమె తన కలల ఇంట్లో అందాలను ఎలా ద్విగుణీకృతం చేయాలనుకుంటున్నారో కూడా వివరించారు. తన జీన్స్ లోనే సౌందర్యం ఉందనేది ఆమె ప్రగాఢ విశ్వాసం. ఆమె ఇంట్లో అన్నీ ఉంటాయి. అన్నట్టు తన ఇంటికి పేరు కూడా ఖరారు చేసుకున్నారు. ఏమిటో తెలుసా? రతికా మహల్. ‘నా కలల రాజ సౌథాన్ని నిర్మించుకోవడానికి హైదరాబాద్ అనువైన స్థలం కానుంది. నేను పక్కా హైదరాబాదీ. అందువల్ల ఇది నా నగరం గొప్పదనానికి నిదర్శనంగా ఉంటుంది. ఎప్పుడైనా సరే నేను కోరుకున్న జీవితాన్ని ప్రారంభించడానికి అస్సలు వేచి ఉండలేను’ అని ముగించారు.