రియల్ ఎస్టేట్ గురుతో టాలీవుడ్ కొత్త నటి షీనా చోహన్
ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తితో కలిసి తెలుగులో అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉన్న నటి షీనా చోహన్ ను ఈ వారం మీకు పరిచయం చేస్తున్నాం. సొంతింటికి సంబంధించి ఆమె కలలు ఎలా ఉన్నాయి? ఇల్లు విషయంలో తన ఆకాంక్షలేంటనేది షీనా రియల్ ఎస్టేట్ గురుతో పంచుకున్నారు. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల ద్వారా ఆర్థికంగా లాభాలు గడించవచ్చనే సంగతి తెలుసుకున్న షీనా.. తెలివైన నిర్ణయం తీసుకున్నారు. తొలుత ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ కు నాంది పలికారు. అనంతరం తన కోసం ఓ ఇల్లు కొనుక్కున్నారు. ‘నేను ఓ కీలకమైన ప్రాజెక్టు చేసిన తర్వాత సొంతింటిని కొనుగోలు చేశాను. నా చిన్నప్పటి ఇల్లు చాలా మినిమలిస్ట్ గా ఉండేది. కానీ వెచ్చగా, హాయిగా అనిపించేది. అయితే, అదృష్టవశాత్తు కావాల్సినంత స్థలం మాత్రం ఉండేది. దాంతో కాస్త విశాలమైన వాతావరణం కనిపించేది. దీంతో చిన్నచిన్న మార్పులతో ఇంటిని అందంగా ఉంచేవాళ్లం’ అని వివరించారు. షీనా ఇల్లు మరీ భారీ ఆస్తి కాదు. కానీ ఈ రాబోయే టాలీవుడ్ నటికి ఇది ఓ ప్రతిష్టాత్మకమైన పెట్టుబడుల్లో ఒకటిగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
‘సింప్లిసిటీ, లగ్జరీ సమ్మేళనం ఎప్పుడూ విలువైనదే. అధిక నాణ్యత కలిగిన ఫర్నిచర్, క్యూరేటెడ్ కలర్ ప్యాలెట్, స్టేట్ మెంట్ లైటింగ్ వంటివి నాకు అవసరంగా అనిపిస్తాయి. నేను సాహిత్యపరమైన ఉన్నత స్థాయి జీవనశైలి గురించి మాట్లాడటం లేదు. నా ఆలోచన అంతా మా ఇంట్లో చిన్న చిన్న వస్తువులతోనే సరైన నేపథ్యం సృష్టించాలనే అంశంతోనే తిరుగుతూ ఉంటుంది. అవన్నీ నన్ను మంత్రముగ్ధురాలిని చేసి అక్కడే ఉండేలా చేయాలి’ అని షీనా పేర్కొన్నారు. ‘ముంబైలో బీచ్ ముందు ఇంటిని ఎంచుకోవడానికి బాగా ఇష్టపడతాను. అలలు చేసే శబ్దాలను వినడం నాకు చాలా ఇష్టం. నా కలల సౌథం నాకు హాయిగా తగినంత విశ్రాంతి ఇస్తుంది’ అని వివరించారు.
ఇంటికి సంబంధించి షీనా చాలా ఉత్సాహంగా బోలెడు సంగతులు చెబుతుండటంతో మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. ‘నేను నా బీచ్ ముందు ఇంటిని సముద్ర తీర అభయారణ్యం అని పిలుస్తాను. ఈ ఇల్లు విశ్రాంతినిచ్చే వెకేషన్ హోమ్ అవుతుంది. సముద్రం నయం చేయలేనిది అంటూ ఏమీ లేదు. అందువల్ల ఇది నా నిరాడంబరమైన రహస్య ప్రదేశం అవుతుంది. ముంబై కాకుంటే హవాయి. ఆ ఇళ్లు నిజమైన హవాయి అనుభవాన్ని ఇస్తాయి. నా భవిష్యత్ తరాలు కూడా ఈ దీవులను ఆశ్వాదించొచ్చు. నేను అందమైన బీచ్ లలోని ఒకదాంట్లో ఓ ఇంటిని సొంతం చేసుకోవడానికి ఇష్టపడతాను’ అని తెలిపారు. ట్రయల్ ఫేమ్ జెన్నిఫర్ అనిస్టన్ ఇల్లు తనకు ఎంత ఇష్టమో చెప్పి ముగించారు.