- ముంబై ఇంట్లో మధురస్మృతులు
- ఇంట్లోని గోడనే ఆమెకు కాన్వాస్
- బాల్కనీలో టీ కప్పుతో ప్రశాంతంగా
బహుముఖ పాత్రలు, వైవిధ్యమైన రోల్స్ తో బాలీవుడ్ లో తనకంటూ ఓ సముచిత స్థానాన్ని ఏర్పరుచుకున్న నటి రాధికా ఆప్టే. సంప్రదాయ నిబంధనలను సవాల్ చేసే పాత్రలను ఆమె అవలీలగా చేస్తారు. స్త్రీలు రోజువారీ ఎదుర్కొనే సంక్లిష్టతలను అప్రయత్నంగానే చిత్రీకరిస్తారు. వెండతెర పైనే కాకుండా ఆమె వెబ్ సిరీస్ లోనూ హవా కొనసాగిస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన లస్ట్ స్టోరీస్, సేక్రెడ్ గేమ్స్, ఘౌల్ వంటి సిరీస్ లలో విమర్శకుల ప్రశంసలు పొందారు. ఏపిల్ టీవీ ప్లస్ సిరీస్ శాంతారామ్ లో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసేందుకు సిద్ధమవుతున్నారు. రాధికా ఆప్టే లండన్ అపార్ట్ మెంట్ లో ఎక్కువ సమయం గడిపినప్పటికీ, ముంబైలో సందడిగా ఉండే వెర్సోవా పరిసరాల్లో ఓ చక్కని ఫ్లాట్ కూడా ఉంది. అది ఆమె పరిశీలనాత్మక అభిరుచి, శక్తివంతమై వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే చక్కని ప్రదేశం. ముంబైలోని తన ఇంటికి సంబంధించిన విశేషాలను భర్త బెనెడిక్ట్ టేలర్ తో కలిసి ఆమె పంచుకున్నారు.
కలల నగరమైన ముంబైలో తన నటనా ప్రయాణాన్ని కొనసాగించేందుకు అవసరమైన ధైర్యం నింపింది భర్త టేలరేనని ఆప్టే వెల్లడించారు. ఆ సందర్భంలో ఆయన చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నారు. మనం ముంబై వెళ్లి దీనిని సాధించడానికి ప్రయత్నిద్దాం అంటూ టేలర్ చెప్పిన మాటే ముంబైలో ఆప్టే ప్రయాణానికి నాంది పలికింది. ఆ ప్రయాణం చివరికి ఆమె ముంబైన తన ఇల్లు అనిపించేలా చేసింది. ఎంతో హాయిగా ఉండే అపార్ట్ మెంట్ ఎంపిక చేసుకోవడం దగ్గర నుంచి దాని గోడలకు వేసే శక్తివంతమై రంగుల వరకు ఇరువురూ ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. ముఖ్యంగా ఇంటి డిజైన్ తోపాటు సహజమైన కాంతి లోపలకు వచ్చే విషయంలో టేలర్ ప్రత్యేక దృష్టి సారించారు. ‘ఆయన వెలుతురులోకి చూస్తారు. అందుకు మా ఇంటి గురించి ఎంతో చక్కగా ఆలోచించి డిజైన్ చేశారు’ అంటూ ఆప్టే మురిపెంగా చెప్పారు. ఆప్టే సంప్రదాయాలకు భిన్నంగా.. వారి శక్తివంతమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే రంగులు, నమూనాల పరిశీలనాత్మక మిశ్రమంగా ఉంటుంది. చక్కగా పెయింట్ చేసిన గోడల నుంచి జాగ్రత్తగా అమర్చిన పాతకాలపు ఫర్నిచర్ ముక్కల వరకు ఆమె 2 బీహెచ్ కే నివాసంలోని ప్రతి మూలా ఎంతో వెచ్చదనాన్ని, ఆహ్లాదకర వాతావరణాన్ని వెదజల్లుతుంది.
ఇంట్లోని ఓ నిర్దష్టమైన గది గోడలను ప్రత్యేకంగా ఆసియన్ పెయింట్స్ కలర్ నెక్స్ట్ కలర్ ఆఫ్ ది ఇయర్ 2018 ఫ్యాషన్ ఫ్లవర్స్ తో అలంకరించారు. ఆప్టే ఉదారమైన ఎంపికలకు, కళాత్మక సున్నితత్వాలకు అది నిదర్శనంగా కనిపిస్తుంది. ఇక తన ప్రతిష్టాత్మక జ్ఞాపకాలు, కళాత్మక వ్యక్తీకరణ కోసం గోడనే కాన్వాస్ గా చేశారు. సెంటిమెంటలిస్ట్ అయిన ఆప్టే.. తన తాతలు, తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఫర్నిచర్ ను జాగ్రత్తగా చూసుకుంటారు. ఆమెకు అత్యంత విలువైన వస్తువులలో ఓ ప్రత్యేకమైన కుర్చీ ఉంది. తన తల్లికి సంబంధించిన శాశ్వతమైన ఉనికికి అది చిహ్నం. ఇక ఆప్టే ఇంట్లో అత్యంత ప్రతిష్టాత్మక ప్రదేశం ఆమె బాల్కనీ. దానిని ఒక నిర్మలమైన ఒయాసిస్ గా భావిస్తారు. నగర జీవితంలోని హడావుడి, సందడి నుంచి ఓదార్పు, విశ్రాంతిని అక్కడే పొందుతారు. బాల్కనీలోకి వచ్చి చేతిలో టీకప్పుతో ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రశాంతమైన క్షణాలను గడుపుతారు. చక్కగా క్యూరేట్ చేసిన లివింగ్ స్పేస్ నుంచి ఇంట్లోని ప్రతి మూలా ఆమె వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుంది. మొత్తానికి రాధికా ఆప్టే ఇల్లు సృజనాత్మకతతో కూడిన సౌకర్యవంతమే కాకుండా జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలను ఇచ్చే సుందరమైన ప్రదేశం.