poulomi avante poulomi avante

షారుక్ ఇల్లు పొడవు పెరగనుందా?

  • మన్నత్ లో రెండు అదనపు అంతస్తుల నిర్మాణానికి షారుక్ భార్య దరఖాస్తు

మన్నత్.. ఈ పేరు తెలియని బాలీవుడ్ అభిమానులు ఉండరు. అదే బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నివాసం. ముంబై బ్రాందాలో సముద్రానికి అభిముఖంగా ఉన్న ఈ నివాసం.. 1914 గ్రేడ్-3 వారసత్వ భవనం. 2091.38 చదరపు మీటర్ల స్థలంలో దీనిని నిర్మించారు. ఇందులో ఆధునిక శైలి ఆరంతస్తుల అనుబంధ భవనం కూడా ఉంది. ఈ అనుబంధ భవనానికి రెండు అదనపు అంతస్తుల జోడించాలని ఖాన్ కుటుంబం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో షారుక్ భార్య గౌరి గతనెల 9న మహారాష్ట్ర కోస్టల్ జోన్ మేనేజ్ మెంట్ అథార్టీకి దరఖాస్తు చేశారు.

రెండు అదనపు అంతస్తుల నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని అందులో కోరారు. ప్రస్తుతం రెండు బేస్ మెంట్లు, గ్రౌండ్, ఆరు అంతస్తుల్లో ఈ భవనంపై 616 చదరపు మీటర్ల బిల్టప్ ఏరియాతో ఏడు, ఎనిమిది అంతస్తుల నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ నిర్మాణానికి రూ.25 కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు. 1997లో షారుక్ ఖాన్ హెరిటేజ్ విల్లా వియన్నాలో షూటింగ్ లో పాల్గొన్నారు. అప్పుడు ఈ విల్లా బాయి కృషేద్ భాను సంజన ట్రస్ట్ ట్రస్టీ నారిమన్ కె దుబాష్ ఆధీనంలో ఉండేది. ఆ భవనం వైభవం, అది ఉన్న ప్రదేశం చూసి షారుక్ ఆశ్చర్యపోయారు. చివరకు ఆ విల్లాను కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నారు.

అనంతరం 2001లో దానిని కొనుగోలు చేసి మన్నత్ అని పేరు పెట్టుకున్నారు. అయితే, ఆ భవనానికి వారసత్వ హోదా ఉండటంతో ఎలాంటి మార్పులు చేయడానికి వీలుపడలేదు. ఈ నేపథ్యంలో అక్కడ ఓ అనుబంధ భవనం నిర్మించారు. ఇప్పుడు ఆ భవనంపైనే రెండు అదనపు అంతస్తుల నిర్మాణానికి అనుమతి కోరారు. అయితే, ఆ అంతస్తులను దేనికి ఉపయోగిస్తారనేది తెలియదు. కాగా, గౌరీఖాన్ దరఖాస్తుకు అనుమతించే విషయంపై సంబంధిత అధికారుల సమావేశమై చర్చించారు. దీనికి సంబంధించి కొన్ని వివరాలు సమర్పించాలని గౌరీఖాన్ కు సూచించారు. ఆ వివరాలను బట్టి తదుపరి సమావేశంలో అనుమతిపై తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles