poulomi avante poulomi avante

అద్దె మార్కెట్లో కొత్త శకం ఎల్ఏ ఎంపైర్

ఏ నగరంలోనైనా అద్దె మార్కెట్ డిమాండ్ బానే ఉంటుంది. నగరానికి తొలుత వచ్చినవారికి వెంటనే కావాల్సింది అద్దె ఇల్లు. అయితే, అద్దె ఇల్లు వెతుక్కోవాలంటే చాలా శ్రమ పడాలి. మనకు కావాల్సిన ఇల్లు వెతుక్కోవడం అంటే చుక్కలు కనపడటం ఖాయం. ఈ నేపథ్యంలో అద్దె ఇళ్ల మార్కెట్లో అంకిత్ లోధా అనే వ్యక్తి ప్రభంజనం సృష్టించాడు. న్యూయార్క్ లో ఏల్ ఏ ఎంపైర్ పేరుతో ఓ సంస్థ స్థాపించాడు. గ్లోబల్ రెంటల్, వెకేషన్ మార్కెట్లో తొలి తరం ఎంట్రప్రెన్యూర్ గా వార్తల్లోకి ఎక్కాడు.

అమెరికా అద్దె ఇళ్ల మార్కెట్లో పలు మోసాలు, లోపాలను చూసిన ఆయన 2022లో ఎల్ఏ ఎంపైర్ స్థాపించాడు. అద్దె ఇళ్ల అన్వేషణలో కొత్త తరహా అనుభవం అందేలా కృషి చేశాడు. దీంతో కేవలం రెండేళ్లలోనే ఆయన సామ్రాజ్యం విస్తరించింది. 30 ప్రాపర్టీలను సొంతం చేసుకోవడమే కాకుండా ఆ ఆస్తుల విలువ రూ.250 కోట్లకు పెరిగింది. ఈ కంపెనీ పోర్టిపోలియో రెంటల్స్ దగ్గర నుంచి వెకేషన్ హోమ్స్, కార్పొరేట్ హౌసింగ్, స్టూడెంట్ అకామిడేషన్స్ వరకు చేరింది. మిడ్ టర్మ్ రెంటల్ విధానాన్ని పరిచయడంతోపాటు నెల నుంచి 11 నెలల వరకు ఫ్లెక్సిబుల్ లీజులు అందించారు. అలాగే ప్రత్యేకమైన వెకేషన్ అనుభవాలు సృష్టించారు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles