దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్తను మోసం చేసినందుకు ఓ బిల్డర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్త షాదాబ్ పటేల్ అమర్ చంద్ నారంగ్, అతని కుమారుడు అమిత్ పై తాజాగా చీటింగ్ కేసు నమోదు చేశారు. ఈ ఇద్దరు తన తండ్రి షబ్బీర్ వద్ద 2014లో రూ.50 లక్షల అప్పు తీసుకున్నారని.. ఇందుకోసం బాంద్రాలో ఉన్న ఒక ఫ్లాటును తనఖా పెట్టారని, పైగా 21 శాతం వడ్డీ అదనంగా అందజేస్తారని నమ్మబలికారు.
అయితే, ఇద్దరూ ఎంతకీ సొమ్ము వెనక్కి ఇవ్వకపోవడంతో షాబాద్ కు అనుమానం ఏర్పడింది. దీంతో, ముందే అనుకున్నట్లు ఫ్లాట్ ను తన పేరిట భద్రతా నిమిత్తం బదిలీ చేయాలని నారంగ్ ని కోరారు. అయితే, ఆ ఫ్లాట్ మీద న్యాయపరమైన వివాదాలు నెలకొనడం వల్ల బదిలీ చేయలేమని చేతులెత్తేశారు. ఆయా ఫ్లాటును అప్పటికే టాటా ఫైనాన్స్ సంస్థకు తనఖా పెట్టారని షాబాద్ తెలుసుకున్నాడు. దీంతో, పోలీసుల్ని ఆశ్రయించాడు. ఇదే విషయమై అమిత్ నారంగ్ ను సంప్రదించగా షాబాద్ మీద కోర్టులో ఫిర్యాదు చేస్తామన్నారు.