poulomi avante poulomi avante

బాచుప‌ల్లిలో బ‌య్య‌ర్లకు చెప్పిందొక్క‌టి.. చేసిందొక్క‌టి..

* అర్బన్ రైజ్.. ఎంవోయూలో రాసింది ఒక‌టి!
* రెరా త‌ర్వాత ప్లాన్ మార్చేశారు!
* తొలుత చెప్పింది.. 22 అంత‌స్తుల్లో 1890 ఫ్లాట్లు
* తర్వాతేమో.. 
33 అంత‌స్తుల్లో 2596 ఫ్లాట్లు
* త‌గ్గిన యూడీఎస్ స్థ‌లం
* ఇదేమిటని అడిగితే సరైన జవాబు లేదు
* తొలుత అమ్మిన‌వి త్రీ బెడ్‌రూమ్ ఫ్లాట్లే
* ఇప్పుడు ఫోర్ బెడ్రూమ్ ఫ్లాట్లకు స్థానం

మార్కెట్ రేటు కంటే తక్కువకే ప్లాట్లు అమ్ముతాం అని ఎవరైనా అంటే.. ఎగిరి గంతేసి.. య‌మ స్పీడుగా వెళ్లేసి.. వెనకా ముందు చూడకుండా కొనేయ‌కండి. అలా చేస్తే.. ఇదిగో బాచుప‌ల్లిలో అర్బన్ రైజ్ ప్రాజెక్టులో కొన్న‌వారి ప‌రిస్థితి మీకూ ఎదురౌతుంది. ఇంత‌కీ ఆ సంస్థ ఏం చేసిందో తెలుసా?

మూడేళ్ల క్రితం.. అర్బన్ రైజ్ సంస్థ (అలియాన్స్‌) ప్రీలాంచ్ స్కీములో విక్రయించేటప్పుడు 1890 ఫ్లాట్లను మాత్రమే నిర్మిస్తానని కొనుగోలుదారులకు తెలిపారు. ఆరంభంలో అమ్మేటప్పుడు 22 అంతస్తులు కడతామని చెప్పారు. ఛానెల్ పార్టనర్ల వ్యవస్థను ప‌రుగులు పెట్టించి.. అధిక కమిషన్ ఆశ చూపెట్టి.. భారీ స్థాయిలో ఫ్లాట్ల‌ను విక్ర‌యించారు. మ‌ధ్య‌లో కరోనా వ‌ల్లనో లేక ఇత‌ర అంశాలో తెలియ‌దు కానీ ప్రాజెక్టు ప‌ని తీరులో పురోగ‌తి లేదు. తీరా హెచ్ఎండీఏ, రెరా అనుమతి లభించాక ఈ సంస్థ ప్రకటన చూసి  కొనుగోలుదారులు ఆశ్చ‌ర్య‌పోయారు. ఎంవోయూలో 22 అంతస్తులని చెప్పి.. ఇప్పుడేమో ఏకంగా 33 అంత‌స్తుల‌కు పెంచేశారు. అంటే, ముందు 1890 ఫ్లాట్లు క‌డ‌తామ‌ని చెప్పిన‌వారే ఆ తర్వాత ఏకంగా 2596 ఫ్లాట్లకు పెంచేశారు. సుమారు ఏడు వందల ఫ్లాట్లను పెంచేశారన్నమాట.

* ఒక్కసారిగా ఏడు వంద‌ల ఫ్లాట్ల‌ను పెంచేయ‌డంతో యూడీఎస్ విస్తీర్ణం త‌గ్గిపోతుంద‌నే విష‌యం కొనుగోలుదారుల‌కు అర్థ‌మైంది. ఇదే అంశాన్ని మార్కెటింగ్ సిబ్బందిని అడిగితే వారి నుంచి స‌రైన స‌మాధానం లేదు. కుదుర్చుకున్న ఒప్పందం ప్ర‌కారం.. 1045 చ‌ద‌ర‌పు అడుగుల ఫ్లాట్లు కొన్న‌వారికి 15.94 గజాల యూడీఎస్ స్థ‌లం వ‌స్తుంది. మ‌రి, పెరిగిన ఫ్లాట్ల ప్ర‌కారం ఈ యూడీఎస్ త‌గ్గుతుందా? లేదా? అనే అంశం అగ్రిమెంట్ ఆఫ్ సేల్ స‌మ‌యంలోనే తెలుస్తుంద‌ని కొంద‌రు కొనుగోలుదారులు అంటున్నారు. ఈ విష‌యాన్ని ఇప్పుడే తేల్చుకోవాల‌ని మ‌రికొంద‌రు బ‌య్య‌ర్లు భావిస్తున్నారు. ముందుగా చేసుకుని ఒప్పందంలో పేర్కొన్న స్థ‌లానికి ఒక్క గ‌జం త‌గ్గిన కొనుగోలుదారులు వెన‌క్కి త‌గ్గ‌కూడద‌ని భావిస్తున్నారు. యూడీఎస్ విష‌యంలో ముందుగా స్ప‌ష్ట‌త ఇవ్వాల‌ని సంస్థ ప్రతినిధుల్ని కోరుతున్నారు. యూడీఎస్ తగ్గితే మాత్రం.. అందుకు త‌గ్గ సొమ్మును తుది ధ‌ర‌లో స‌ర్దుబాటు చేయాల్సిన బాధ్య‌త సంస్థ మీదే ఉంది.

* ప్రీలాంచ్‌లో అమ్మేట‌ప్పుడు 2, 2.5, 3 ప‌డ‌క గ‌దుల ఫ్లాట్లను మాత్ర‌మే క‌డ‌తామ‌ని అంద‌రికీ చెప్పారు. తీరా రెరా అనుమ‌తి ల‌భించాక చూస్తే.. నాలుగు ప‌డ‌క గ‌దుల ఫ్లాట్ల‌ను డిజైన్ చేశారు. ఈ విష‌యం తెలుసుకుని కొనుగోలుదారులు ప్ర‌శ్నిస్తే.. కొత్త రేటు ప్ర‌కారం మిగ‌తా స్థ‌లానికి సొమ్ము క‌ట్ట‌మ‌ని ఓ ఉచిత‌ స‌ల‌హా పారేశార‌ని కొనుగోలుదారులు అంటున్నారు. అందుకే, ఇలాంటి కంపెనీలో కొన‌కుండా.. న‌గ‌రానికి చెందిన స్థానిక సంస్థ వ‌ద్ద కొనుగోలు చేస్తే ఉత్త‌మం అని కొంద‌రు భావిస్తున్నారు.

• ప్రీలాంచులో కొనేటప్పుడు కొనుగోలుదారులకు ఎక్కడా జీఎస్టీ గురించి చెప్పలేదట.  ఇప్పుడేమో తీరా రెరా అనుమతి లభించాక జీఎస్టీ కట్టమని చెబుతున్నారని కొందరు కొన్నవారు అంటున్నారు. ఎవరైనా గట్టిగా ప్రశ్నిస్తే.. హ్యండోవర్ సమయంలో కట్టేందుకు సమయం ఇస్తున్నారట. అందుకే, ప్రీలాంచులో కొనేట‌ప్పుడు ఒక‌టికి రెండుసార్లు ఆలోచించి తుది నిర్ణ‌యానికి రావాలి. లేక‌పోతే, ఇదిగో అర్బ‌న్ రైజ్ సంస్థ త‌ర‌హాలోనే అధిక శాతం మంది డెవ‌ల‌ప‌ర్లు అత్యాశ‌కు పోయి.. మోసం చేసే అవ‌కాశాల్లేక‌పోలేవు. కాబ‌ట్టి, ప్రీలాంచుల ప‌ట్ల త‌స్మాత్ జాగ్ర‌త్త‌.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles