- రాంకీ హార్మనీ.. చక్కని ఆఫర్
- ప్రగతి నగర్ లో ప్రీమియం ప్రాజెక్టు
ప్రముఖ నిర్మాణ కంపెనీ రాంకీ.. అదిరిపోయే ఆఫర్ తో తన కొత్త ప్రాజెక్టు లాంచ్ చేసింది. ప్రగతి నగర్ లో రాంకీ వన్ హార్మనీ పేరుతో ఈ సంస్థ ప్రీమియం ప్రాజెక్టులో ఫ్లాట్ సొంతం చేసుకోవాలంటే కేవలం 10 శాతం మొత్తం చెల్లిస్తే చాలు. మనకు ఫ్లాట్ అప్పగించే వరకు ఎలాంటి ఈఎంఐ భారం పడదు. గృహప్రవేశం చేసిన తర్వాతే ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది. 8.1 ఎకరాల స్థలంలో ఏడు టవర్లలో ఆధునిక జీవనశైలికి తగిన విధంగా విస్తృతమైన సౌకర్యాలు, అద్భుతమైన ల్యాండ్ స్కేపింగ్, రెండు విశాలమైన క్లబ్ హౌస్ లతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది.
రెండు బేస్ మెంట్లు, గ్రౌండ్, 9 అంతస్తులతో దీనిని నిర్మిస్తున్నారు. 2, 3 బీహెచ్ కేలలో 803 ఫ్లాట్లు అందుబాటులో ఉన్న ఈ ప్రాజెక్టు 2023 డిసెంబర్ నాటికి పూర్తవుతుంది. నగరంలోని ప్రముఖ విద్యాసంస్థలు, మాల్స్, ఐటీ హబ్స్, ఆస్పత్రులకు చక్కని కనెక్టివిటీని కలిగి ఉండటం ఈ ప్రాజెక్టుకు అదనపు బలం. వీఎన్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ 2.1 కిలోమీటర్ల దూరంలో ఉండగా.. గోకరాజు రంగరాజు ఇంజనీరింగ్ కాలేజీ 4.4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక జేఎన్టీయూ 5 కిలోమీటర్ల దూరంలో ఉండగా.. 4.1 కిలోమీటర్లు వెళితే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వస్తుంది. 5.7 కిలోమీటర్ల దూరంలో ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ చేరుకోవచ్చు. ఇక రెమెడి ఆస్పత్రి 5.8 కిలోమీటర్ల దూరంలో, ఉషా ముళ్లపూడి ఆసత్రి 6.1 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అలాగే ఏసియన్ జీపీఆర్, మంజీరా, ఫోరం వంటి మాళ్లు 6 కిలోమీటర్ల లోపే ఉన్నాయి. అరకిలోమీటర్ దూరంలోనే మోర్ సూపర్ మార్కెట్ ఉంది.
ఇవీ ఈ ప్రాజెక్టు ప్రత్యేకతలు..
- టెన్నిస్, హాఫ్ బాస్కెట్ బాల్ కోర్టులు
- ఔట్ డోర్ జిమ్, క్రికెట్ ప్రాక్టీస్ నెట్
- సెంట్రల్ కోర్ట్ యార్డ్
- ఓపెన్ ఎయిర్ థియేటర్
- పిల్లల ఆటస్థలం
- ప్రతి బ్లాక్ కూ ప్రత్యేక ఎంట్రీ
- ల్యాండ్ స్కేప్ గార్డెన్స్
- కారు వాషింగ్ సౌకర్యం
- లాండ్రీ
- సీనియర్ సిటిజన్స్ జోన్
- ఏసీ జిమ్
- బిజినెస్ లాంజ్
- ఇండోర్ గేమ్స్
- మెడిటేషన్, యోగా రూం
- గెస్ట్ రూం
- మల్టీ పర్పస్ హాల్.. ఇంకా మరెన్నో..