- సన్ సిటీ సమీపంలో అదిరిపోయే విల్లా ప్రాజెక్టు
- వచ్చే నెల నుంచి రెడీ టు ఆక్యుపై
అదిరిపోయే డిజైన్.. ఆకట్టుకునే వాతావరణం.. ఆనందానికి కేరాఫ్ అడ్రస్.. అసలైన లగ్జరీ లైఫ్ స్టైల్ కి సరైన నిర్వచనం.. ఎస్ఎంఆర్ వినయ్ కాసా కారినో ప్రాజెక్టు. 22 ఎకరాల సువిశాల స్థలంలో కళ్లు చెదిరేరీతిలో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్టు నభూతో నభవిష్యత్ అనడంతో ఎంతమాత్రం సందేహం లేదు. 5బీహెచ్ కేతో మొత్తం 145 ట్రిప్లే విల్లాలు అందుబాటులో ఉన్నాయి. నాణ్యమైన, సౌకర్యవంతమైన జీవనానికి, మీ జీవితంలో పూర్తిస్థాయి ఆనందాన్ని గడపడానికి ఇంతకుమించిన చక్కని ప్లేస్ మరొకటి ఉండదేమో. సృజనాత్మకమైన డిజైన్ తో చక్కటి కమ్యూనిటీ జీవితానికి పూర్తి అర్హతలు కలిగిన ఈ ప్రాజెక్టులో విల్లా సొంతం చేసుకుంటే ఆ మజాయే వేరు.
రెరా అనుమతి పొందిన ఈ ప్రాజెక్టులో 254 చదరపు గజాల నుంచి 447 చదరపు గజాల మధ్యలో విల్లాలు లభ్యమవుతాయి. టైప్ ఏ విల్లాల్లో ఈస్ట్ ఫేసింగ్ విల్లాలు 354 నుంచి 414 చదరపు గజాల మధ్యలో ఉండగా.. నార్త్ ఫేసింగ్ విల్లాలు 308 చదరపు గజాల్లో, వెస్ట్ ఫేసింగ్ విల్లాలు 370 నుంచి 448 చదరపు గజాల మధ్యలో ఉన్నాయి. ఇక టైప్ ‘బి’ విల్లాల్లో ఈస్ట్ ఫేసింగ్ వి 346 నుంచి 385 చదరపు గజాల్లో, నార్త్ ఫేసింగ్ వి 287 చదరపు గజాల్లో, వెస్ట్ ఫేసింగ్ వి 343 నుంచి 385 చదరపు గజాల్లో ఉన్నాయి. అలాగే టైప్ ‘సి’ విల్లాల్లో ఈస్ట్ ఫేసింగ్ విల్లాలు 322 నుంచి 368 చదరపు గజాల మధ్యలో ఉండగా.. వెస్ట్ ఫేసింగ్ వి 322 నుంచి 353 చదరపు గజాల్లో ఉన్నాయి.
సౌకర్యాల్లోనూ సూపర్..
ఎస్ఎంఆర్ వినయ్ కాసా కారినో ప్రాజెక్టులో సౌకర్యాలు సైతం శెభాష్ అనిపించే రీతిలో ఉన్నాయి. జాగింగ్ ట్రాక్ తోపాటు బాస్కెట్ బాల్ కోర్టు, టెన్నిస్ కోర్టు, పిల్లల ఆట స్థలాలు, పరికరాలు, డిజైనర్ లాండ్ స్కేపింగ్, ఫౌంటెయిన్లు, గెస్ట్ పార్కింగ్, జిమ్నాజియం, యోగా సెంటర్, మల్టీ పర్పస్ హాల్, గెస్ట్ రూమ్స్ ఉన్నాయి. అలాగే ప్రతి విల్లాలో ప్రత్యేకంగా స్విమ్మింగ్ పూల్, హోం థియేటర్ ఏర్పాటు చేశారు. ప్రత్యేకమైన వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్, మురుగునీటి శుద్ధి ప్లాంట్ కూడా ఉన్నాయి.
లివింగ్, డైనింగ్ ఏరియాలతోపాటు బెడ్ రూమ్స్ లో టెలిఫోన్ పాయింట్లు, అలాగే ప్రధాన సెక్యూరిటీ కంట్రోల్ తో ఇంటర్ కమ్ అనుసంధానం కూడా ఉంది. 100 శాతం జనరేటర్ బ్యాకప్, సీసీ టీవీ కెమెరాలు, 24 గంటల సెక్యూరిటీ ఉంటుంది. అలాగే ప్రతి విల్లాకు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఏర్పాటు చేశారు. జిమ్, లైబ్రరీ, ఓపెన్ పార్టీ ఏరియా, టెర్రస్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ గేమ్స్ తదితరాలతో కూడిన చక్కని క్లబ్ హౌస్ కూడా నిర్మిస్తున్నారు.
లోకేషన్ కూడా అదుర్స్..
లొకేషన్ పరంగానూ చక్కని ప్రదేశంలో ఉండటం మరో అడ్వాంటేజ్. సన్ సిటీకి సమీపంలో షాదన్ కాలేజీ పక్కనే ఈ ప్రాజెక్టు నిర్మితమవుతోంది. వైద్యం, విద్య, రిటైల్ మాల్స్ వంటివి ఎన్నో చాలా దగ్గర్లోనే ఉన్నాయి. క్రేయాన్స్ ఆస్పత్రికి 2 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఆలివ్ ఆస్పత్రికి 12 నిమిషాల్లో వెళ్లొచ్చు. టీఎస్ పీఏ జంక్షన్ 5 నిమిషాల దూరంలో ఉండగా.. మెహదీపట్నం వెళ్లాలంటే 15 నిమిషాలు సరిపోతుంది. ఇక గ్లెండాలే అకాడమీ, టైమ్ స్కూల్ అత్యంత సమీపంలో ఉండగా.. కేంద్రీయ విద్యాలయ, శ్రీనిధి ఇంటర్నేషన్ స్కూల్ కు 13 నిమిషాల్లో వెళ్లొచ్చు.
12 నిమిషాలు డ్రైవ్ చేస్తే వాసవి ఇంజనీరింగ్ కాలేజ్, 20 నిమిషాల డ్రైవ్ తో సీబీఐటీ చేరుకోవచ్చు. బుద్వేలు ఐటీ క్లస్టర్ 5 నిమిషాల డ్రైవింగ్ తో వెళ్లొచ్చు. మరి ఇన్ని సౌకర్యాలతో కూడిన విల్లాలోకి ఎప్పుడెప్పుడు వెళ్లిపోవాలా అని ఉందా? ఇందుకోసం మీరు ఎంతోకాలం ఎదురు చూడాల్సిన అవసరమే లేదు. ఇప్పటికే ప్రాజెక్టు దాదాపుగా పూర్తయ్యాయి. విల్లా కొనుక్కోవడమే తరువాయి.. వచ్చే నెలలోనే ఎంచక్కా గృహప్రవేశం కూడా చేసేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే ప్రాజెక్ట్ సైట్ బాట పట్టండి.