poulomi avante poulomi avante

రెడీ టు ఆక్యుపై.. ఆర్‌వీ సంవ్రిత‌!

ప్రాజెక్టు ప‌రిచయం 

ప్రాజెక్టు : ఆర్‌వీ సంవ్రిత‌
ఎక్క‌డ‌: కిస్మ‌త్‌పూర్‌
(టీఎస్‌పీఏ జంక్ష‌న్ ఎగ్జిట్ 18)
విస్తీర్ణం: 10.26 ఎక‌రాలు
మొత్తం విల్లాలు: 118
క్ల‌బ్ హౌజ్‌: సుమారు 1000 గ‌జాలు (జి+4 అంత‌స్తులు)
నిర్మాణం: హ్యాండోవ‌ర్ స్థాయి

హైద‌రాబాద్‌లో ల‌గ్జ‌రీ విల్లాలు ఎక్కువే ఉన్నాయి. అనుకున్న దానికంటే అధిక శాతం మంది బిల్డ‌ర్లు విల్లాల్ని నిర్మిస్తున్నారు. కాక‌పోతే, కొన్ని ప్రాజెక్టులు మాత్ర‌మే బ‌య్య‌ర్ల‌ను విశేషంగా ఆక‌ర్షిస్తాయి.  అలాంటి మ‌హ‌త్త‌ర‌మైన ప్రాజెక్టులో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాల‌ని భావించేవారు.. గృహ‌ప్ర‌వేశానికి సిద్ధంగా ఉన్న త‌మ సంవ్రిత‌ను వీక్షించాల‌ని ఆర్‌వీ నిర్మాణ్ సంస్థ స‌గ‌ర్వంగా చెబుతోంది. ఈ హైఎండ్ క‌మ్యూనిటీలో ల‌గ్జ‌రీ విల్లాను సొంతం చేసుకుంటే.. జీవిత‌మెంతో ఆనంద‌భ‌రిత‌మేన‌ని అంటోంది. మ‌రి, ఇందులో విల్లా కొనుక్కున్న వారికి అదృష్టం ఎందుకు వ‌రిస్తుందో తెలుసుకోవాల‌ని ఉందా? అయితే, మీరు ఈ క‌థ‌నం చ‌ద‌వాల్సిందే.

కిస్మ‌త్ పూర్ అంటే.. ముందుగా ప్ర‌తిఒక్క‌రికీ టీఎస్‌పీఏ (అప్పా) జంక్ష‌న్ గుర్తుకొస్తుంది. ఔట‌ర్ రింగ్ రోడ్డు గచ్చిబౌలి ఎగ్జిట్ 18 నుంచి టోల్ గేట్ దాటాక వచ్చే మొదటి ఎగ్జిట్ ఇది. ఈ ఏరియాలో అనేక‌ అపార్టుమెంట్లు నిర్మాణంలో ఉన్నా.. విల్లాల‌కు మాత్రం కిస్మత్ పూర్ ప్రసిద్ధి చెందింది. ఈ ఏరియా ప్రత్యేకతలు తెలుసుకుంటే.. ఇంత‌కాలం ఈ ప్రాంతం ఎలా మిస్ అయ్యామ‌ని అనిపించ‌డం ఖాయం. ఇక్క‌డి వాతావరణం, గాలి, నీరు అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది. ఈ ప్రాజెక్టును డెవ‌ల‌ప‌ర్ కేవ‌లం లాభాల్ని ఆర్జించ‌డానికే చేశారా? లేక ఒక ల్యాండ్ మార్క్ విల్లా క‌మ్యూనిటీని సృష్టించ‌డానికి ప్ర‌య‌త్నించారా? అని ఎవ‌రైనా నిశితంగా ప‌రిశీలిస్తే.. రెండో అంశానికే ఆర్‌వీ నిర్మాణ్ ప్రాధాన్య‌త‌నిచ్చింద‌నే విష‌యం అర్థ‌మ‌వుతుంది.

సంస్థ గురించి..

ఆర్‌వీ సంవ్రిత‌ ప్రాజెక్టును నిర్మించే ఆర్‌ నిర్మాణ్ సంస్థ గురించి ఎంత చెప్పినా త‌క్కువే అవుతుంది. ఈ సంస్థ కల్చర్ గురించి, పాటించే విలువ‌ల గురించి ముందుగా తెలుసుకోవాలి. నిర్మాణాలంటే ఎంతో ప్యాష‌న్ ఉన్న ఇద్ద‌రు సివిల్ ఇంజినీర్లు క‌లిసి మొదలు పెట్టిన సంస్థ ఇది. 1995 నుంచి నేటి వ‌ర‌కూ అనేక ప్రాజెక్టుల్ని చేప‌ట్టారు. ఇన్ని దశాబ్దాలు గడుస్తున్నా నాటి పార్టనర్స్ నేటికీ ఉండట‌మే ఈ సంస్థ ప్ర‌త్యేక‌త‌. ఇదే విషయాన్ని ఆర్‌వీ నిర్మాణ్ ఎండీ రామచంద్ర రెడ్డి వ‌ద్ద ప్ర‌స్తావిస్తే.. బిజినెస్ కోసం స్నేహం చేస్తే ఎక్కువ కాలం నిలబడదని.. అదే స్నేహం కోసం బిజినెస్ చేస్తే చిర‌కాలం నిలుస్తుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఇంతకాలం మార్కెటింగ్ విభాగం అనేది లేకుండా యాభై లక్షల చదరపు అడుగుల స్థ‌లాన్ని విక్ర‌యించారంటే.. వారి క‌స్ట‌మ‌ర్లు ఎంత అభిమానులుగా మారి.. ఉచితంగా మార్కెటింగ్ చేశారో అర్థ‌మ‌వుతుంది.

భ‌విష్య‌త్తులో కిక్కిరిసిపోదు!

ఆర్ వీ సంవ్రిత‌ ప్రాజెక్టును ఏ సివిల్ ఇంజనీర్ చూసినా, మరో బిల్డర్ చూసినా నాణ్యతకు ఎంత ప్రాధాన్యమిచ్చారో స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతుంది.  కిస్మత్ పూర్‌ ఏరియా సుమారు 6000 వేల ఎకరాల గ్రీనరీ ఉన్న గచ్చిబౌలికి , కోకాపేటకు 30 నిమిషాల్లో వెళ్లే అతి కొద్దీ ప్రాంతాల్లో ఒకటి. ఈ ఏరియా ఎప్పటికీ జనసాంద్రతతో కిక్కిరిసిపోయే అవకాశమే లేదు. ఎందుకంటే ఇక్కడ భూములన్నీ ఆర్మీ, అగ్రికల్చరల్ యూనివర్సిటీ, కిద్వాయ్ పార్క్, ఫారెస్ట్ ల్యాండ్ వంటి వాటితో పచ్చదనంతో నిండి ఉంది. కిస్మత్ పూర్ జన సాంద్ర‌త కూడా చదరపు కిలోమీటరుకు మూడు వేల మంది మాత్ర‌మేన‌ని గుర్తుంచుకోండి.

ఎక్క‌డికైనా సుల‌భంగా..

సిటీలో ఎక్కడి నుంచి అయినా కిస్మ‌త్ పూర్‌కి సుల‌భంగా చేరుకోవ‌చ్చు. రాజేంద్ర నగర్  అత్తాపూర్ మీదుగా  పీవీ నరసింహ రావు బ్రిడ్జి రోడ్ నుంచి ఎయిర్ పోర్ట్ కు సుల‌భంగా రాక‌పోక‌ల‌ను సాగించొచ్చు. ఇక్క‌డ్నుంచి కోకాపేట సెజ్, ఫైనాన్షియ‌ల్ డిస్ట్రిక్టుకు 25 నిమిషాల్లో చేరుకోవ‌చ్చు. ఇంతే స‌మ‌యంలో లంగ‌ర్ హౌజ్ మీదుగా ల‌క్డీకాపూల్ కు వెళ్లొచ్చు. గండిపేట, మృగవని పార్క్, చిలుకూరు బాలాజీ గుడి, శంకరపల్లి రిసార్ట్స్ ఇలా ఆహ్లాదమైనా, వ్యాపారమైనా, వ్యవహారమైనా.. అన్ని వసతులు, స్కూల్స్, హాస్పిటల్స్ ఉన్న ఒక అందమైన ప్రాంతం.. అందులో ఆర్‌వీ సంవ్రిత‌

ఎందుకు ఆర్‌వీ సంవ్రిత‌ విల్లా?

ఆర్‌వీ సంవ్రిత ప్రాజెక్టును ఆర్‌వీ నిర్మాణ్.. సుమారు 10.26 ఎక‌రాల్లో నిర్మిస్తున్నారు. ఇందులో వ‌చ్చే విల్లాల సంఖ్య‌.. దాదాపు 118. ఇందులో ఒక్కో విల్లా ప్లాటు సైజు సుమారు 238 నుంచి 260 గ‌జాలు కాగా.. బిల్ట‌ప్ ఏరియా 2879 నుంచి 3062 చ‌ద‌ర‌పు అడుగుల దాకా ఉంటుంది. ఒక్క‌సారి ప్రాజెక్టు ఆవ‌ర‌ణ‌లోకి వ‌చ్చి.. విల్లాల ఎలివేష‌న్ని చూసే వారెవ్వ‌రైనా వావ్ అనాల్సిందే. ల్యాండ్ స్కేపింగ్ ఎంతో చూడ‌ముచ్చ‌ట‌గా తీర్చిదిద్దారు. ఇందులోని క్ల‌బ్ హౌజ్ ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంది. చిన్నారులు, యువ‌తీయువ‌కులు, మ‌హిళ‌లు, పెద్ద‌లు.. ఇలా ప్ర‌తిఒక్క‌రికీ అక్క‌ర‌కొచ్చే స‌దుపాయాల‌న్నీ ఈ క్ల‌బ్ హౌజ్‌లో డిజైన్ చేశారు.

వావ్‌.. టెర్ర‌స్ పూల్‌..

సుమారు వెయ్యి గ‌జాల్లో ఏర్పాటు చేస్తున్న క్ల‌బ్ హౌజ్‌లో టెర్ర‌స్ పూల్ ప్ర‌తిఒక్క‌ర్ని ఆక‌ట్టుకుంటుంది. ఇందులో నివ‌సించేవారు తీరిక స‌మ‌యాల్లో స్విమ్మింగ్‌ని ఆస్వాదించొచ్చు. ఇందులోని బ్యాంకెట్ హాల్‌, యోగా మెడిటేష‌న్ హాల్‌, డైనింగ్ హాల్‌, గెస్ట్ రూములు, ఏసీ జిమ్‌,  ఇండోర్ గేమ్స్ రూమ్‌, మ‌సాజ్ రూమ్‌, యూనిసెక్స్ సెలూన్‌, టేబుల్ టెన్నిస్‌, స్టీమ్ బాత్ వంటి సౌక‌ర్యాలు అందుబాటులో ఉంటాయి.  ఔట్‌డోర్ విష‌యానికి వ‌స్తే.. బాస్కెట్ బాల్ ప్రాక్టీస్ పోల్‌, క్రికెట్ నెట్, యాంఫీ థియేట‌ర్‌, చిల్డ్ర‌న్స్ ప్లే ఏరియా, జాగింగ్ ట్రాక్ వంటివి అభివృద్ధి చేస్తున్నారు.

భ‌ద్ర‌తా, ఆధునిక స‌దుపాయాల కార‌ణంగా గేటెడ్ క‌మ్యూనిటీలో ఉండ‌ట‌మే అన్నింటి కన్నా మేల‌ని చెప్పొచ్చు. అయితే ఆ విల్లా కమ్యూనిటీ ఉండే ప్రాంతాన్ని బట్టి ధర మారిపోతుంది. అలాగని ధర తక్కువొస్తుందని యాభై కిలోమీటర్లు దూరంలో ఉండట‌మూ, నిత్యం గంటలకొద్దీ ప్రయాణించడం అవివేకమ‌ని చెప్పొచ్చు. ప్రీ లాంచ్ ఆఫరులో తక్కువకు వస్తుందని అనుమతులు లేని ప్రాజెక్టు.. పట్టాలెక్కి చేతికి అందేవరకూ పడే ఒత్తిడి.. ఆరోగ్యానికీ మంచిది కాదు. ఈ రోజు పెరిగిన ముడి సరుకుల ధరల వల్ల‌ నిర్మాణం ఎక్కడ చేపట్టినా తక్కువకు ఇవ్వలేరు. భూమి ధ‌ర‌లోనే తేడా అనే విష‌యాన్ని గుర్తుంచుకోండి. ఈ రోజుల్లో చూసింది నమ్మడం అంత ఉత్తమం మరొకటి లేద‌నే విష‌యాన్ని మ‌ర్చిపోవ‌ద్దు.
బిల్డర్ యొక్క అనుభవం, విలువ‌ల గురించి తెలుసుకోవడానికి గూగుల్ రివ్యూస్ తప్ప కొనుగోలుదారునికి మరో మార్గం తెలియదు. ఏ ప్రాజెక్టులో కొంటున్నారో ఆ ప్రాజెక్టు కస్టమర్తో మాట్లాడితేనే అసలు విషయం తెలుస్తుంది. రాజీ లేనటువంటి శ్రేష్ఠమైన నాణ్యతతో, రెరా ప్ర‌కారం ఇచ్చిన అన్ని హామీలను నిలుపుకుంటూ చేపట్టిన ఆర్‌వీ సంవ్రిత‌ విల్లా ప్రాజెక్టు దాదాపు పూర్తి కావొచ్చింది. కొన్ని విల్లాల్లో ఇంటీరియర్స్ ప‌నులు జ‌రుగుతున్నాయి. గృహప్రవేశానికి సిద్ధమవుతున్న ఆర్‌వీ సంవ్రిత‌ విల్లాలను ఈ వారమే త‌ప్ప‌క చూడండి. మనసుకు నచ్చితే వెంట‌నే బుక్ చేసేయండి. గత కొన్నేళ్ల‌లో ఎన్నో రెట్లు పెరిగిన భూమి ధరల వలన ఇలాంటి ప్రాజెక్టులు.. ఇంత త‌క్కువ ధ‌రలో.. ఇంత ద‌గ్గ‌ర‌లో రాలేవ‌ని ఖ‌చ్చితంగా చెప్పొచ్చు. ఇంతే భూమిలో ఎన్ని లక్షల చదరపు అడుగులు వస్తాయో లెక్క‌లేసి..  అని నేలను విడిచి నివసించే నివాస గృహాలే కొనగలిగే స్థాయికి మార్కెట్ వెళ్ళిపోయిందనే విష‌యం మ‌ర్చిపోవ‌ద్దు.
విల్లాలో ఉండడం వలన వచ్చే మొదటి కానుక ప్ర‌కృతి. మీ మొక్కల్ని మీరే పెంచుకోవ‌చ్చు. ఇందులో నేల మీది.. ఆకాశం మీది. మీరెంతో ముచ్చ‌ట‌ప‌డి కొనుక్కున్న‌ కారు మీ ముందు ఉంటుంది. ప్రాజెక్టులో ఉన్న విల్లాలే 118. కాబట్టి, ఒకరికొకరు పరిచయమవుతారు. తక్కువ మంది వలన ప్రశాంత‌త‌ ఉంటుంది. ర‌ద్దీని ఇష్టపడేవారికి విల్లా పెద్దగా నచ్చదు. నిశ్శబ్దం విలువ తెలిసిన వారికి, ప్రకృతి ప్రేమికులకు, పక్షుల కిలకిలలు ఆస్వాదించేవారికి, ఆలోచనా పరులకు, ఆరోగ్యమంటే బాడీ, మైండ్‌, ఎమోష‌న‌ల్‌, స్పిరిచ్యుల్ గా.. హాయిగా.. ఉండాల‌ని తెలిసిన‌వారికో మంచి విల్లా ప్రాజెక్టు.. వాల్యూ ఫ‌ర్ మ‌నీ అనిపిస్తే.. అంత‌కంటే అదృష్ట‌మేముంది? ఆర్‌వీ సంవ్రిత‌ విల్లా ప్రాజెక్ట్ డ్యూప్లే నిర్మాణంతో సమతుల్యంగా నిర్మించబడింది. రోడ్డుకు రెండో ప్రాజెక్టు కావ‌డంతో ఎప్పటికీ శ‌బ్దం లేదా డస్ట్ పొల్యూషన్ రాని విధంగా సీసీ రోడ్లతో ఒక ప్రైవేటు రోడ్డు ఆర్‌వీ సంవ్రిత‌ నివాసితులందరికీ ఎప్పటికీ ఒక వరమే. ఒక ఆరోగ్యకరమైన, ఆనందదాయకమైన వాతావరణంలో, అత్యంత శ్రేష్ఠమైన నిర్మాణంతో నిర్మించిన‌ విల్లాలు కొద్దిమందికి మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఆ అదృష్టవంతులందరికీ ఆనందంతో గొప్పగా జీవించడానికి ఆర్‌వీ సంవ్రిత‌ ఆహ్వానం పలుకుతోంది.

వైవిధ్య‌మైన విల్లాలు సిద్ధం..

సాధారణంగా విల్లా ప్రాజెక్టుల్లో ఒక దిక్కులో ఉండే ఎలివేష‌న్ల‌న్నీ ఒకే విధంగా ఉంటాయి. కానీ, ఆర్‌వీ సంవ్రిత‌లో వైవిధ్యానికి ప్రాధాన్య‌మిస్తూ.. ఈస్ట్ ఫేసింగ్ నాలుగు ఎలేవేషన్లు, వెస్ట్ ఫేసింగ్ నాలుగు ఎలివేషన్లను డిజైన్ చేశాం. నాణ్యతలో ఎక్కడ రాజీ పడకుండా.. సానిటరీ, హార్డ్ వేర్ మ‌రియు ఫ్లోరింగుల్లో హై ఎండ్ ఉత్పత్తుల్ని వినియోగించాం. ఫ్లోరింగులో ఇటాలియన్ మార్బుల్ ని వినియోగించాం. ప్రాజెక్టులో సిమెంట్ రోడ్లను శ్రేష్ఠ‌మైన నాణ్య‌త‌తో వేయ‌డం వ‌ల్ల దీర్ఘ‌కాలం మ‌న్నిక‌గా నిలుస్తాయి. ఆవ‌ర‌ణ‌లో ప్ర‌తి కూడ‌లిని అంద‌మైన డిజైన్ల‌తో అత్యుత్త‌మంగా తీర్చిదిద్దాం. ఒకసారి మా కమ్యూనిటీకి విచ్చేసి స్వయంగా చూస్తే.. ఆర్‌వీ సంవ్రిత‌ను ఎంత విభిన్నంగా తీర్చిదిద్దామో అర్థ‌మ‌వుతుంది. వెస్ట్ హైద‌రాబాద్‌లో ల్యాండ్ మార్క్ విల్లా గేటెడ్ క‌మ్యూనిటీ జాబితాలో ఆర్‌వీ సంవ్రిత నిలుస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.
– చెరుకు చైత్ర‌, సీఓఓ, ఆర్‌వీ నిర్మాణ్‌
spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles