ఇంటి నిర్మాణానికి స్టీల్ చాలా అవసరం. పది కాలాలపాటు ఇల్లు మన్నికగా ఉండాలంటే అంతే మన్నికైన స్టీల్ వాడకం తప్పనిసరి. ఈ విషయంలో జర్మన్ టీఎంఎక్స్ బార్లు మీ ఇంటికి మరింత దృఢత్వాన్ని తెస్తాయని కంపెనీ పేర్కొంటోంది. జర్మన్ టీఎంఎక్స్ బార్లు అధిక యూటీఎస్, వైఎస్ నిష్పత్తిని కలిగి ఉన్నాయని, భూకంపాలను తట్టుకునేలా చేస్తాయని వివరించింది. అధిక బలం, అధిక డక్టిలిటీతో మన్నికైన నిర్మాణాలను అందిస్తుందని స్పష్టంచేసింది. బార్లను ఉత్పత్తిలో వినియోగించే ముడిపదార్థాలు తక్కువ కార్బన్ కంటెంట్ ను కలిగి ఉండటం ఉల్ల తుప్పు పట్టే అవకాశం లేదని పేర్కొంది. ‘థర్మో మెకానికల్ ట్రీట్మెంట్ జర్మన్ టీఎంఎక్స్ బార్లకు దీర్ఘకాలిక మన్నిక ఇవ్వడమే కాకుండా భూకంప నిరోధక శక్తిని ఇస్తుంది.
జర్మన్ టీఎంఎక్స్ బార్ల బయటి ఉపరితలం గట్టి ఫెర్ ఐసీ ఆక్సైడ్ లేయర్ కలిగి ఉంది. ఇది కోర్ ఓషన్ ను నిరోధిస్తుంది. అలాగే ఈ బార్లు కాంక్రీటులో బలంగా ఇమిడిపోతాయి. అందువల్ల నిర్మాణ బలం, దృఢం మరింత పెరుగుతుంది. ఉత్పత్తిలో తక్కువ కార్బన్ కంటెంట్ ముడిపదార్థాలను వినియోగించిన కారణంగా అధికమైన వెల్డబిలిటీ కలిగి ఉంటుంది. సెక్షనల్ వెయిట్ లో తక్కువ టోలరెన్స్ నిర్వహించడం వల్ల ఇతర కంపెనీల స్టీల్ తో పోలిస్తే 15 శాతం వరకు ఆదా అవుతుంది’ అని కంపెనీ వివరించింది. జర్మన్ టీఎంఎక్స్ 3.6 లక్షల ఎంటీపీఏ ఉక్కు తయారీ సామర్థ్యం కలిగి ఉందని, తాము ఇంటిగ్రేటెడ్ మాన్యుఫాక్చరింగ్ సౌకర్యాలు కలిగి ఉన్నామని పేర్కొంది. తమ ఉత్పత్తి ప్రక్రియ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉందని స్పష్టం చేసింది.