- రియల్ ఎస్టేట్ గురుతో
అమిగోస్ నటి ఆషికా రంగనాథ్
అమిగోస్ చిత్రం హీరోయిన్ ఆషికా రంగనాథ్‌కు అందరి మాదిరిగానే బాల్యంలో అభివృద్ధి చెందిన కాలనీలో నివసించేందుకు ఇష్టపడేది. కర్ణాటక ఆర్కిటెక్చర్ కు అద్దంపటే విధంగా ఆమె ఇల్లుండేది. ఆ ఇంట్లో మేం అనేక సంబరాల్ని జరుపుకున్నాం. అందులో వెళ్లడమనేది మా జీవితంలోనే మరుపురాని నిర్ణయం. కాకపోతే, ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగానే నా ఇష్టాయిష్టాలుంటాయి. కాకపోతే, నా గతాన్ని నేను పూర్తిగా మర్చిపోలేదు.
పారిశ్రామిక ప్రాంతంలో పెరిగానే. అక్కడ విద్య ఎంతో బాగుండేది. దక్షిణాదిలోనే ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజీలు అక్కడే ఉండేవి. నేను నటిగా మారిన తర్వాత ఆధునిక మౌలిక సదుపాయాలు ఉన్న.. ఏకాంత, సాంప్రదాయ ఇల్లు ఉండాలని కోరుకోవడం మొదలెట్టారు. వైవిధ్యమైన సౌందర్యం నన్ను బాగా ఆకర్షిస్తుంది. సాదా రంగుల్ని ఇష్టపడతాను. అవి కంటికి ఆహ్లాదకరంగా ఉండాలని అనుకుంటాను. నా పాత ప్రాధాన్యతలనే నిలుపుకోవాలన్నది నా ఆలోచన. అందుకే, చారిత్రక శైలికి ప్రభావితమయ్యాను. హోటళ్లలో నివసించినప్పుడు విలాసాన్ని అనుభవించాను. కాకపోతే, రద్దీగా ఉండే వీధులు మరియు ప్రధాన రహదారి ప్రాంతాలకు దూరంగా ఉండాలని అనుకుంటాను. ఇల్లు అనేది ఒక ఇల్లులా ఉండాలని ఇంటీరియర్స్ మనోహరంగా కనిపించాలని కోరుకుంటాను.
శాంతి లేదు..
ప్రకృతికి పెద్దపీట వేయకుండా ఉండటాన్ని ఆమె అస్సలు ఇష్టపడదు. “నేను ఎప్పుడైనా నా కోసం ఒక పెద్ద బంగళాను కొనుగోలు చేస్తే దానిని నా స్వంత చేతులతో భద్రపరచుకోవాలని అనుకుంటున్నాను. నటిగా, నేను చాలా బిజీగా ఉంటాను. కాబట్టి ఇంటి నిర్వహణ తక్కువగా ఉండాలని కోరుకుంటాను. నా చెఫ్‌లు వండిన రుచికరమైన భోజనాన్ని ముగించిన తర్వాత, నేను నా తోటలో సంతోషంగా నడవాలని ఆశిస్తాను. నాకున్న పరిజ్ఞానంతో ల్యాండ్ స్కేపింగ్ ప్రాముఖ్యతను గుర్తించాను. పచ్చదనం మరియు ఖాళీ స్థలాలనేవి జీవనశైలిని మెరుగపరుస్తాయని తెలుసుకున్నాను. నేను ప్రస్తుతం ఉంటున్న అపార్టుమెంట్లో శాంతి లేదు. అందుకే, వీలైనం త్వరగా విల్లాలోకి మారిపోవాలని ఉంది.
చివరిగా..
కిచ్చా సుదీప్ యొక్క ఇల్లు భలే ఉంటుందని ఆషిక తెలుసుకుంది. అతని ఇంట్లోని టెర్రస్ కిచెన్ సెంటరాఫ్ అట్రాక్షన్ అని చెప్పింది. ఇంటీరియర్స్ మొత్తం తనే ప్లాన్ చేశానని చెప్పాడు. ఫ్యాన్సీ సామాను కూడా కొన్నాడు. కరోనా సమయంలో అక్కడ కేకులు, కుకీలను తయారు చేసి డ్రైవర్ ద్వారా స్నేహితులకు పంపేవాడు. చెక్క ఫ్లోరింగ్‌తో చేసిన టెర్రస్ కిచెన్ మరిచిపోలేనిదని చెప్పొచ్చు అంటూ ముగించింది.