కొత్త ఆదాయపు పన్ను విధానం రూపకల్పనలో పాల్గొన్న ప్రతిఒక్కరికీ అభినందనలు. మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా. పన్ను చెల్లింపుదారులు, వ్యాపారులు వేడుక చేసుకునే పరిస్థితుల్ని బడ్జెట్లో కల్పించారు.
ప్రైవేటు పెట్టుబడులకు మెరుగైన అవకాశాలు, రవాణా ఆధారిత అభివృద్ధి, పట్టణ పారిశుద్ధ్యానికి సంబంధించిన అంశాలకు పెద్దపీట వేయడం వల్ల నగరాల్లో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. సుస్థిరమైన పట్టణాల్లో కృత్రిమ మేధస్సు ఆధారంగా ప్రతిపాదించిన పరిశోధన వల్ల నగరాల ల్యాండ్ స్కేపింగ్కు సంబంధించిన డిజైన్, నిర్మాణం, ప్రణాళికలో ఎదుర్కొంటున్న అనేక సంక్లిష్ఠతలకు పరిష్కారం లభిస్తుంది.- అజితేష్ కొరుపోలు, ఫౌండర్ & సీఈవో, ఏఎస్బీఎల్